ఆ సినిమా ఆగిపోయినట్లే!

టాలీవుడ్ సినిమాల మార్కెట్ గట్టి ఒడిదుడుకులకు లోనవుతోంది. నాన్ థియేటర్ ఆదాయాన్ని నమ్ముకుని ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకున్నారు. హీరోలు అమాంతం తమ రెమ్యూనిరేషన్లు పెంచేసారు. ఎనిమిది నుంచి పది కోట్లు తీసుకునే హీరోలు…

టాలీవుడ్ సినిమాల మార్కెట్ గట్టి ఒడిదుడుకులకు లోనవుతోంది. నాన్ థియేటర్ ఆదాయాన్ని నమ్ముకుని ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసుకున్నారు. హీరోలు అమాంతం తమ రెమ్యూనిరేషన్లు పెంచేసారు. ఎనిమిది నుంచి పది కోట్లు తీసుకునే హీరోలు ఇప్పుడు పాతిక కోట్లు డిమాండ్ చేస్తున్నారు. 

అయిదారు తీసుకునే హీరోలు పది నుంచి పన్నెండు అడుగుతున్నారు. దీంతో కాస్త ఓ రేంజ్ సినిమా అంటే చాలు వంద కోట్ల మేరకు ఖర్చు అయిపోతోంది. పైకి చెప్పలేక, కక్కలేక నిర్మాతలు కిందా మీదా అవుతున్నారు. ఇప్పుడిప్పుడే నిర్మాతలు మేలుకొంటుున్నారు. కిట్టుబాటు కానీ ప్రాజెక్టులను పక్కన పెడుతున్నారు.

మైత్రీ సంస్థ దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి ఓ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. కానీ తీరా చేసి అన్ని లెక్కలు వేసుకుంటే 120 కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని లెక్కలు తేలుతున్నాయి. అందులో హీరో రెమ్యూనిరేషన్ నే దాదాపు పాతిక కోట్ల వరకు వుంటుంది. కానీ మార్కెట్ లెక్కలు వేసుకుంటే 100 కోట్ల వరకు రీచ్ కావడం కూడా కష్టం అని తెలిసిందట. దాంతో అంతా డిస్కస్ చేసుకుని ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారని తెలుస్తోంది.

ధమాకా తరువాత ఇంత వరకు రవితేజతో సినిమా చేసిన ఏ నిర్మాత లాభాలు కళ్ల చూడలేదు. విడుదలకు ముందు టేబుల్ ప్రాఫిట్ కనిపించడం, సినిమా ఫ్లాప్ కావడం, జిఎస్టీలు వెనక్కు ఇచ్చుకోవడం, ఎంతో కొంత వెనక్క కట్టడం ఇలాంటివి అన్నీ కలిసి నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి. కానీ నిర్మాతలు ఎవరూ పైకి చెప్పుకోరు.

మొత్తం మీద మైత్రీ సంస్థ గోపీచంద్ మలినేని డేట్ లను మరో హీరో కోసం వాడే ప్రయత్నం చేస్తోంది. నిజానికి ఇది ఆరంభం మాత్రమే. హీరోలు రెమ్యూనిరేషన్లు తగ్గించుకోకపోతే,  నాన్ థియేటర్ ఆదాయం పడిపోయిన నేపథ్యంలో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం కష్టం.