కాఫీ విద్ కరణ్ అంటేనే అంతా ఓపెన్ అని అర్థం. కాఫీ తాగాలి, మనసులో ఉన్నదంతా కక్కేయాలి అనే టైపులో ఉంటుంది వ్యవహారం. ఇప్పటికే చాలామంది ఇలా కక్కేశారు. ఇప్పుడు సారా అలీఖాన్ వంతు వచ్చింది. తాజా సీజన్ లో పాల్గొన్న సారా అలీఖాన్.. తన పాత ప్రేమలు, ఎఫైర్స్ పై స్పందించింది.
గతంలో హీరో కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేసింది సారా అలీఖాన్. అయితే కొన్నాళ్లకే ఇద్దరూ విడిపోయారు. దీనిపై పరోక్షంగా స్పందించింది సారా అలీఖాన్. కార్తీక్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ప్రతి రిలేషన్ షిప్ నుంచి కొంత నేర్చుకుంటామని తెలిపింది. నిజానికి ఇండస్ట్రీలో రొమాంటిక్ రిలేషన్ షిప్స్ శాశ్వతం కాదంటూ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చింది.
దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందించాడు. సారా అలీఖాన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడ్డాడు. వ్యక్తిగత సంబంధాల గురించి పబ్లిక్ డొమైన్ లో మాట్లాడ్డం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. తను ఎప్పుడూ తన రిలేషన్ షిప్స్, లవ్ ఎఫైర్స్ గురించి మీడియాలో మాట్లాడలేదని, ఒకరి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడ్డం సరికాదన్నాడు. మరీ ముఖ్యంగా కొన్ని విషయాల్ని బాహాటంగా మాట్లాడకుండా ఉండడమే మంచిదంటూ స్పందించాడు.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. గతంలో సారా అలీఖాన్ తో పాటు అనన్య పాండేతో కూడా డేటింగ్ చేశాడు కార్తీక్ ఆర్యన్. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి కాఫీ విద్ కరణ్ లో పాల్గొన్నారు.