ఎపిక్ డిజాస్టర్ ఓటీటీలోకి వచ్చేసింది

ఇన్నాళ్లూ తన సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో నార్త్ బెల్ట్ ను ఆకర్షించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చూసి, నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకైనా మంచిదని రీమేక్ సబ్జెక్ట్ ను…

ఇన్నాళ్లూ తన సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో నార్త్ బెల్ట్ ను ఆకర్షించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చూసి, నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకైనా మంచిదని రీమేక్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. యాక్షన్ సబ్జెక్ట్ ను బాగా తీస్తాడనే పేరున్న వినాయక్ ను దర్శకుడిగా తీసుకున్నాడు. ఇలా సెటప్ అంతా బాగానే కుదిరినప్పటికీ, రిజల్ట్ మాత్రం తేడాకొట్టింది. అదే హిందీ ఛత్రపతి.

దాదాపు రెండేళ్లు టాలీవుడ్ కు విరామం ఇచ్చి మరీ బెల్లంకొండ చేసిన ఈ హిందీ ప్రయత్నం భారీగా బెడిసికొట్టింది. బాలీవుడ్ లో ఎపిక్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈమధ్య కాలంలో వచ్చిన అతిచెత్త రీమేక్ గా పేరుతెచ్చుకుంది. అలా రిలీజైన వారానికే దుకాణం సర్దేసిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో ప్రత్యక్షమైంది.

అప్పట్లో థియేటర్లలోకి వచ్చినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హిందీ ఛత్రపతిపై విమర్శలు గుప్పించారు. వాళ్లంతా ఇప్పుడు మరోసారి డ్యూటీ ఎక్కారు. ప్రభాస్ క్లిప్పింగ్స్, బెల్లంకొండ క్లిప్పింగ్స్ ను కంపేర్ చేస్తూ, కొత్త ట్రోలింగ్ కు శ్రీకారం చుట్టారు.

తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది ఛత్రపతి సినిమా. ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా హిందీ రీమేక్ మాత్రం డిజాస్టర్ అయింది. 55 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు అటుఇటుగా కేవలం రెండున్నర కోట్ల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది.