బోటు రాజకీయానికి చెక్ పెట్టిన జగన్

ప్రమాదం జరగడం విషాదం. ఆ వెంటనే నినాదాలు డిమాండ్లు వస్తూంటాయి. అయితే విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన బోటు ప్రమాదంలో సాయం అయితే జెట్ స్పీడ్ తో జగన్ అందించారు అని వైసీపీ…

ప్రమాదం జరగడం విషాదం. ఆ వెంటనే నినాదాలు డిమాండ్లు వస్తూంటాయి. అయితే విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన బోటు ప్రమాదంలో సాయం అయితే జెట్ స్పీడ్ తో జగన్ అందించారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

ఆదివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలభై దాకా బోట్లు పూర్తిగా దగ్ధం కాగా మరో అరవై దాకా బోట్లు పాక్షికంగా దగ్ధం అయ్యాయి. ఒక్కో బోటు విలువ ఇరవై లక్షల దాకా ఉండవచ్చు అని అంచనా.

ఇది ప్రమాదంగా జరిగిందా కావాలని ఎవరైనా చేశారా అన్నది దర్యాప్తు సాగుతోంది. బోటు ప్రమాదం జరిగింది అన్న వార్త విన్న వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాగా రియాక్ట్ అయ్యారు. మొత్తం బోటు విలువలో ఎనభై శాతం నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

విపక్ష నేతల డిమాండ్ల కంటే ముందే ప్రభుత్వమే ఇలా స్పందించడంతో ఇపుడు కొత్త డిమాండ్ తెస్తున్నారు. బోటులో ఉన్న సామగ్రికి కూడా విలువ కట్టి పరిహారం ఇవ్వాలని. అయితే ప్రభుత్వం అన్నీ చేస్తుంది, అందరినీ బాగా ఆదుకుంటుంది. కానీ ఈ విషాద సమయంలో రాజకీయం చేయవద్దు అని వైసీపీ నేతలు అంటున్నారు.

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దాని మీద ఫైవ్ మెన్ కమిటీ రంగంలోకి దిగింది. కాలి బూడిద అయిపోయిన బోట్ల వెనక ఉన్న కుట్ర కోణాన్ని చేదించే పనిలో ఫైవ్ మెన్ కమిటీ సీరియస్ గా పనిచేస్తోంది.