ఈ నెల 26న ప్రధాని మోదీ తిరుమలకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇటీవల తరచూ ఆయన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి ఆయన రానున్నారు. ఈ నెల 27న ప్రధాని శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ మేరకు తిరుపతి జిల్లా పోలీస్ అధికారులకు సమాచారం అందింది.
ప్రధాని తిరుమల పర్యటన నేపథ్యంలో కొండపై గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం తిరుమలలో పోలీస్ అధికారులు అదే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాని బస చేసే గెస్ట్‌హౌస్, దాని చుట్టూపక్కన చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీస్ అధికారులు దృష్టి సారించారు.
27న కలియుగ దైవ దర్శనానంతరం ప్రధాని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని తిరుమల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కూడా వచ్చే అవకాశాలపై ఇంకా స్పష్టత రాలేదు. బహుశా సీఎం రావచ్చని సమాచారం. గతంలో కూడా ప్రధాని తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు, సీఎం జగన్ వెంట ఉన్నారు.