మహేష్ అభిమానుల చూపు మొత్తం ఇప్పుడు గుంటూరు కారం సినిమాపైనే ఉంది. ఆ సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నో నిట్టూర్పులు, ఎదురుచూపుల తర్వాత ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. ఆ పాటతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పాట కూడా అదే రేంజ్ లో క్లిక్ అయింది.
ఇప్పుడీ సినిమా నుంచి రెండో పాట రెడీ అయింది. గుంటూరు కారం సెకెండ్ సింగిల్ ను మరో వారం రోజుల్లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాత నాగవంశీ ప్రకటించాడు.
“గుంటూరు కారం సినిమాకు సంబంధించి ఇంకా 3 పాటలు రిలీజ్ చేస్తాం. ఆ 3 పాటలు రిలీజ్ చేయడానికి కావాల్సినంత టైమ్ ఉంది. మిగిలిన ఆ 3 పాటలను వచ్చే ఏడాది మొత్తం ప్రేక్షకులు పాడుకుంటారు. అంత బాగా వచ్చాయి. వీటిలో ఒక పాటను వచ్చే వారం రిలీజ్ చేస్తున్నాం.”
ఇలా గుంటూరు కారం సెకెండ్ సింగిల్ అప్ డేట్ ఇచ్చాడు నిర్మాత. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి సెకెండ్ హీరోయిన్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది గుంటూరు కారం సినిమా.