వివాదాలనే నమ్ముకున్న హీరో

ఎంత చేసినా సినిమాకు బజ్ రాకుంటే వివాదాలే శరణ్యం. సమ్ థింగ్ నెగిటివ్ లైన్ లో వెళ్తే వచ్చే పబ్లిసిటీ వేరు. మా సినిమా చూడండి.. చూడండి అంటూ పాజిటివ్ ప్రచారం చేస్తే కిక్కు…

ఎంత చేసినా సినిమాకు బజ్ రాకుంటే వివాదాలే శరణ్యం. సమ్ థింగ్ నెగిటివ్ లైన్ లో వెళ్తే వచ్చే పబ్లిసిటీ వేరు. మా సినిమా చూడండి.. చూడండి అంటూ పాజిటివ్ ప్రచారం చేస్తే కిక్కు రాదు. బహుశా అందుకే కావచ్చు హీరో నాని ఈ నెగిటివ్ రూట్ లో ట్రయ్ చేస్తున్నారు.

నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ టైపు వీడియో వదిలారు. అందులో నారా లోకేష్ ను ఇమిటేట్ చేసారు. ఆ ఇద్దరూ రాలేదా అంటూ.. రెండు చానెళ్లను లోకేష్ ప్రస్తావించే విధంగా వీడియో కట్ చేసారు. అలాగే గతంలో తాను అన్న కిరాణా కొట్టు కామెంట్, అప్పుడు వైకాపా నుంచి వచ్చిన ప్రతిస్పందన మరోసారి కెలికే ప్రయత్నం చేసారు.

మళ్లీ ఈ రోజు మరో వీడియో వదిలారు. ఈ వీడియోలో కేసిఆర్ ను ఇమిటేట్ చేసారు. అంత వరకు బాగానే వుంది.  ఈ మధ్య అందరూ రివ్యూలు చూస్తున్నారు అని వాయిస్ ఓవర్ లో వినిపించి, అయితే ఏం చేద్దాం, అందరికీ తలా లక్ష ఇద్దామంటావా? అంటూ ఓ కామెంట్ విసిరారు. అయినా సినిమా బాగుంటే చూస్తారు..లేదంటే లేదు అంటూ మళ్లీ నాని నే ముక్తాయించారు.

మొత్తం మీద కాస్త డిఫరెంట్ రూట్ లో ప్రచారం చేయాలని, పనిలో పనిగా వీలయితే చిన్న వివాదం వచ్చినా సినిమాకు మంచిదే అవుతుందనే డబుల్ షాట్ ఆలోచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

సినిమా విడుదలకు ఇంకా మరో పదిహేను రోజులు టైమ్ వుంది. ఈ లోగా మరెన్ని ప్రయోగాలు చేస్తారో చూడాలి. కానీ ఇలాంటివి అన్నీ అర్బన్ ఆడియన్స్, సోషల్ మీడియా ఫాలోవర్ల వరకు రీచ్ అవుతాయేమో కానీ, గ్రౌండ్ లెవల్ లో సినిమాకు బజ్ రావాలంటే మాత్రం ఇవి చాలవేమో?