అవునా బురద పాములు తెలుగుదేశంలో ఉన్నాయా. అంటే ఉన్నాయని అంటున్నారు సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. కొన్ని బురద పాములు టీడీపీలో ఉన్నాయని, అవి గత మూడేళ్లుగా పుట్టలో దాక్కున్నాయని లెటెస్ట్ గా హాట్ హాట్ కామెంట్స్ చేశారు అయ్యన్న.
ఆ బురద పాములు ఏనాడూ పార్టీ కష్టాల్లో ఉంటే పనిచేయలేదని, కార్యకర్తల మీద దాడులు జరిగినా, ఏకంగా పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగినా కూడా గమ్మున ఉన్నాయని అయ్యన్న గుర్తు చేశారు. ఇపుడు మాత్రం పుట్టలో నుంచి బయటకు వచ్చాయని అంటున్నారు.
ఏకంగా చంద్రబాబు పక్కన కూర్చుని కొందరు నేతలు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అని కూడా ఆయన విమర్శించారు. పార్టీని పట్టని నాయకులను పక్కన పెట్టుకుంటే అటు క్యాడర్ కి ఇటు ప్రజలకు ఏ రకమైన సందేశం వెళ్తుందో ఆలోచించాలని ఆయన బాబుకు కూడా సూచించారు.
ఈ రోజు పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు చాలా మంది ఉన్నారని, వారిని గుర్తుపెట్టుకోవాలని అయ్యన్న బాబుని కోరారు. అలాంటి వారికే ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప బురద పాములకు కాదని ఆయన కటువుగానే చెబుతున్నారు.
మొత్తానికి అయ్యన్న తాజాగా చేసిన ఈ కామంట్స్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. బురద పాములు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఎవరి మీద అని కూడా చర్చ సాగుతోంది. అయితే ఒక మాజీ మంత్రిని ఉద్దేశించి అయ్యన ఈ వేడి వేడి విమర్శలు చేశారని అంటున్నారు.
ఇక పార్టీకి సర్వాధికారి అయిన చంద్రబాబుకు బురద పాములు ఏవో తెలియకుండా ఉంటుందా అన్న మాటా ఉంది. ఏది ఏమైనా అయ్యన్న కామెంట్స్ మాత్రం ఇపుడు టీడీపీలో హీట్ పుట్టిస్తున్నాయి.