జనసేనను ఓ అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ శక్తే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏపీ విభజిత రాష్ట్రానికి డీజీపీగా కూడా ఆయన పని చేశారు. పవన్‌కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఆ ఐపీఎస్ అధికారి సేవల్ని రాజకీయంగా జనసేన వాడుకుంటోంది. ఇటీవల ట్రాఫిక్ చలానా కుంభకోణంలో సదరు మాజీ డీజీపీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు బయటపడ్డ సంగతి తెలిసిందే.
అయితే సదరు మాజీ డీజీపీ ఎప్పుడూ జనసేన తరపున తెర ముందుకు రాలేదు. కానీ రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన, పోలీస్ బాస్‌గా తనకున్న సంబంధాల రీత్యా క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని ఎప్పటికప్పుడు జనసేనాని పవన్‌కు నివేదిస్తున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేనలో ఆయన మరింత క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.
ఏపీలో కడప నుంచి శ్రీకాకుళం వరకూ జనసేన బలం, బలహీనతల గురించి ఆ పోలీస్ మాజీ బాస్ వివరాలు సేకరిస్తూ, పవన్‌కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అలాగే జనసేనను బలోపేతం చేసుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని పవన్‌కు ఆయన సలహాలు కూడా ఇస్తున్నారని తెలిసింది. టీడీపీతో పొత్తు నేపథ్యంలో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై కూడా పవన్‌కు సదరు మాజీ డీజీపీ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నట్టు సమాచారం.
ఈ పోలీస్ మాజీ బాస్ పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తారని అంతా అనుకున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో చంద్రబాబు, జగన్మోహన్రెడ్డిలను ఆయన కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఈయన గారి మాజీ అల్లుడు టీడీపీకి చెందిన మహిళా నేతతో ప్రేమలో పడడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మాజీ డీజీపీ కూతురికి విడాకులిచ్చి, బాబు కేబినెట్లో మంత్రి అయిన యువ మహిళా నేతను వివాహమాడారు. ఎన్నికల నాటికైనా తెర ముందుకు జనసేన అదృశ్య శక్తి వస్తుందేమో చూడాలి.