విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత!

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ న‌టుడు చంద్ర‌మోహ‌న్(80) క‌న్నుముశారు. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో కొద్దిరోజులుగా బాధ‌ప‌డుతున్న ఆయ‌న అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  Advertisement కృష్ణా జిల్లా ప‌మిడిముక్క‌ల…

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ న‌టుడు చంద్ర‌మోహ‌న్(80) క‌న్నుముశారు. గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో కొద్దిరోజులుగా బాధ‌ప‌డుతున్న ఆయ‌న అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

కృష్ణా జిల్లా ప‌మిడిముక్క‌ల గ్రామంలో 1943 మే 23న జ‌న్మించిన ఆయ‌న‌.. 1966లో రంగుల‌రాట్నం సినిమాతో తెరంగేట్రం చేశారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేశారు. నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్‌ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. మొత్తం 932కిపైగా చిత్రాల్లో నటించారు. హీరోగా సుమారు 175 సినిమాలకు పైగా చేశారు.

చంద్ర‌మోహ‌న్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు, రేపు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.