పాపం, సీనియర్ హీరోలకు కాస్త కష్టంగానే వుంది. ఎవరో ఒక యంగ్ హీరోను తోడు చేసుకుంటే తప్ప పని జరుగుతుందన్న నమ్మకం లేదు. అలా తోడు చేసుకున్నా ఆచార్య సినిమాతో పని జరగలేదు.
సల్మాన్, సత్యదేవ్, రవితేజ, ఇలా ప్యాడింగ్ ల కోసం మెగాస్టార్ చిరంజీవి ట్రయ్ చేస్తూనే వున్నారు. లేటెస్ట్ గా చేస్తున్న వేదాళం రీమేక్ లో ఓ క్యారెక్టర్ కోసం హీరోలు దొరకడం లేదు. సినిమాలో ఈ పాత్ర మరీ పెద్ద పాత్ర కాదు. అందుకే ఏ హీరో కూడా ఊ అనడం లేదు.
నాగశౌర్య ను అడిగారు. మొహమాటానికి పోకుండా నో అనేసారని వార్తలు వచ్చాయి. ఏడాది క్రితం నితిన్ ను కూడా అడిగారు. ఆయన చేయబోతున్నారంటూ ఇప్పుడు వార్తలు వచ్చేసాయి.
కానీ అవి వాస్తవం కాదంట…నితిన్ కూడా మెగాస్టార్ సినిమాలో చిరుపాత్ర ఆఫర్ కు సున్నితంగా నో అని చెప్పేసాడట.
ఇప్పుడు ఆ పాత్ర కోసం వేరే చిన్న చిన్న హీరోలను ట్రయ్ చేస్తున్నారని బోగట్టా. చూడాలి మొహమాటానికైనా ఎవరు ఊ అంటారో?