మహేష్ బాబు బీడీ వెనక అసలు కథ

గుంటూరుకారం సినిమాలో గుప్పుగుప్పుమంటూ బీడీ తాగాడు మహేష్. నిజజీవితంలో మహేష్ సిగరెట్ తాగడు. ఒకప్పుడు అతడు సిగరెట్ తాగేవాడు. ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాడు.   Advertisement అలాంటి వ్యక్తి గుంటూరుకారం సినిమా కోసం…

గుంటూరుకారం సినిమాలో గుప్పుగుప్పుమంటూ బీడీ తాగాడు మహేష్. నిజజీవితంలో మహేష్ సిగరెట్ తాగడు. ఒకప్పుడు అతడు సిగరెట్ తాగేవాడు. ఆ అలవాటు మానుకోవడానికి చాలా కష్టపడ్డాడు.  

అలాంటి వ్యక్తి గుంటూరుకారం సినిమా కోసం మళ్లీ స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడంటే ఎవ్వరూ నమ్మరు. అది కచ్చితంగా డమ్మీ బీడీ అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడా బీడీ మేటర్ బయటపెట్టాడు మహేష్. దాని పేరు ఆయుర్వేదిక్ బీడీ.

“నేను స్మోక్ చేయను, స్మోకింగ్ ఎంకరేజ్ చేయను. గుంటూరుకారంలో నేను తాగింది ఓ ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో చేసిన బీడీ అది. అందులో పొగాకు, నికొటిన్ ఉండదు. ఫస్ట్ నాకు నిజమైన బీడీ ఇచ్చారు. అది తాగితే తలనొప్పి వచ్చేసింది. నా వల్ల కాదని త్రివిక్రమ్ కు చెప్పేశాను. చాలా ఆలోచించి, నా కోసం ఆయుర్వేదిక్ బీడీ తెచ్చారు. అది తాగిన తర్వాత బాగుంది.”

ఇలా తన బీడీ తాగుడు వెనక అసలు కథ బయటపెట్టాడు మహేష్. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టాడు. గుంటూరుకారం ఇంటర్వెల్ ఎపిసోడ్ లో కీలకమైన సన్నివేశాన్ని సింగిల్ టేక్ లో పూర్తిచేశాడట ఈ హీరో.

ఇంటర్వెల్ లో వచ్చిన కీలకమైన సన్నివేశాన్ని సింగిల్ టేక్ లో చేశానని, షాట్ అయిపోయిన వెంటనే అమ్మ పలికేసిందని అన్నానని తెలిపాడు. ఆ టైమ్ లో ఏదో మేజిక్ జరిగిందని, దీంతో రెండో టేక్ అవసరం రాలేదని చెప్పుకొచ్చాడు. అలాంటి మేజిక్స్ గుంటూరుకారం సినిమాలో చాలా జరిగాయంటున్నాడు.