ఆ ఇద్దరు ఇంచార్జిలు వీకేనా?

వైసీపీ గతంలో ప్రకటించిన రెండు నియోజకవర్గాల ఇంచార్జిలు వీక్ అని ప్రచారం సాగుతోందంట. వారిని మారుస్తారు అని సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్ధి పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం గాజువాక, అనకాపల్లి…

వైసీపీ గతంలో ప్రకటించిన రెండు నియోజకవర్గాల ఇంచార్జిలు వీక్ అని ప్రచారం సాగుతోందంట. వారిని మారుస్తారు అని సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్ధి పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం గాజువాక, అనకాపల్లి సీట్లకు ఇంచార్జిలను ప్రకటించింది.

కార్పోరేటర్ గా ఉన్న ఉరుకూటి రామచంద్రరావుని గాజువాక ఇంచార్జిగా చేశారు. అనకాపల్లికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉన్న మలసాల భరత్ కుమార్ ని ప్రకటించారు. ఈ ఇద్దరూ తమ శక్తి కొలదీ పార్టీ నేతలను కలుపుకుంటూ పోతున్నా వారిని సమర్ధులైన ప్రత్యర్ధులుగా అపొజిషన్ భావించడంలేదు అంటున్నారు.

పార్టీ నేతల సహకారం కూడా అలాగే ఉంది అంటున్నారు. గాజువాకలో చూస్తే బలంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే  తిప్పల నాగిరెడ్డి వర్గం ఉరుకూటిని మార్చాలని డిమాండ్ చేస్తోంది. మరో నేతకు ఇచ్చినా ఓకే అంటూ అధినాయకత్వానికి సంకేతాలు పంపుతోంది. ఈ పేచీ చాలా రోజులుగా సాగుతోంది.

అనకాపల్లిలో కూడా అనుకున్నంతగా మలసాల ముందుకు సాగలేకపోతున్నారు అని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం చేయించిన సర్వేలలో సైతం ఈ ఇద్దరు ఇంచార్జిలు కొంచెం వీక్ అన్నట్లుగా వచ్చిందట. దాంతో తర్వాత వచ్చే జాబితాలో ఇక్కడ మార్పు చేర్పులు ఉండవచ్చు అని ప్రచారం సాగుతోంది.

అనకాపల్లి సీటుని సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ కే తిరిగి ఇస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన వేరే చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఓకే చెప్పినా ఆయన కోరుకున్న సీటు అయితే అధినాయకత్వం చూపించలేకపోయింది. దాంతో ఆయనకే అనకాపల్లిని తిరిగి అప్పగిస్తారు అని అంటున్నారు.

గాజువాకలో కూడా మార్పులు ఉంటాయని సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీలో మెజారిటీ నేతలు కోరుకునేలా ఆ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో అధినాయకత్వం విడుదల చేసే ఏడవ జాబితాను చూస్తే తెలుస్తుంది అని అంటున్నారు.