రష్మికపై డేటింగ్ రూమర్స్ కొత్త కాదు. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందంటూ కొందరు, ఈ ఏడాదిలోనే వాళ్లి చేసుకుంటారని మరికొందరు రకరకాల ప్రచారాలు తెరపైకి తీసుకొచ్చారు. ఓవైపు ఈ మేటర్ ఇలా నడుస్తుంటే, మరోవైపు రష్మిక ఎప్పట్లానే సోషల్ మీడియాలోకి వచ్చింది.
ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండే రష్మిక, ఈరోజు కూడా అదే పని చేసింది. చాలా రోజులైందని, మాట్లాడుకుందామని ఛాటింగ్ షురూ చేసింది. కాకపోతే ఆమె చేసిన తప్పేంటంటే, సరిగ్గా వాలంటైన్స్ డేకు ముందురోజు ఛాటింగ్ పెట్టడం.
రష్మిక ఆన్ లైన్లోకి రావడంతో.. దాదాపు 90శాతం మంది ఆమెను ప్రేమికుల రోజు గురించే అడిగారు. “రేపు ప్రొగ్రామ్ ఏంటి, ఎక్కడ” అంటూ పరోక్షంగా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నలన్నింటికీ కామన్ గా సమాధానం ఇచ్చింది రష్మిక. తనకు రేపు కూడా షూటింగ్ ఉందంట. తను షూటింగ్ లోనే ఉంటానని, ఎలాంటి 'ప్రత్యేక కార్యక్రమాలు' లేవని రష్మిక స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా తను నటించిన ఓ సినిమాపై క్లారిటీ ఇచ్చింది రష్మిక. 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాను, స్క్రిప్ట్ నచ్చకపోయినా కేవలం శర్వానంద్, దర్శకుడు కిషోర్ తిరుమల కోసం చేశాననే ప్రచారాన్ని రష్మిక తిప్పికొట్టింది. స్క్రిప్ట్ నచ్చిన తర్వాత ఏ సినిమా అయినా చేస్తానని స్పష్టం చేసింది.