తండేల్ ను ఎక్కువ నమ్ముతున్న ‘గీతా’

చిరకాలంగా గీతా సంస్థకు సరైన విజయాలు లేవు. గీతా నుంచి ఫండింగ్ అందించి, బ్యానర్ యాడ్ చేయించగా, వేరే వాళ్లు తీస్తున్న సినిమాలు సాధించిన విజయాలు వున్నాయి తప్ప గీతాకి అంటూ ప్రత్యేకంగా విజయం…

చిరకాలంగా గీతా సంస్థకు సరైన విజయాలు లేవు. గీతా నుంచి ఫండింగ్ అందించి, బ్యానర్ యాడ్ చేయించగా, వేరే వాళ్లు తీస్తున్న సినిమాలు సాధించిన విజయాలు వున్నాయి తప్ప గీతాకి అంటూ ప్రత్యేకంగా విజయం వరించి చాలా కాలం అయింది. అలాగే గీతా2 కి కూడా.

ఇలాంటి నేపథ్యంలో ఇక చిన్న సినిమాలు కాదు, మనం కూడా అందరి బాటలో వెళ్లి భారీ సినిమా చేయాల్సిందే అని ‘తండేల్’ సినిమాను తలకెత్తుకున్నారు. సుమారు 70 కోట్ల బడ్జెట్. సినిమాకు కాస్టింగ్‌నే 35 కోట్ల వరకు అవుతుందని అంచనా.

ఎందుకంటే దర్శకుడు చందు మొండేటికే 10 కోట్ల రెమ్యూనిరేషన్. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అయిదు కోట్ల వరకు చార్జ్ చేస్తారు. ఇక సాయి పల్లవి హీరోయిన్, నాగ్ చైతన్య హీరో.. మరో పది హేను కోట్లు. ఇక మిగిలిన సాంకేతిక సిబ్బంది. నటులు. ఇక సినిమా నిర్మాణానికి ముఫై అయిదు కోట్లు అవుతుందని అంచనా. అంటే టోటల్ ప్రాజెక్ట్ 70 కోట్లు పైమాటే.

అయితే అదృష్టం ఏమిటంటే సరైన నాన్ థియేటర్ డీల్ పడితే యాభై నుంచి అరవై కోట్లు క్లోజ్ చేయవచ్చు. అందుకే ముందుగా సినిమా మొదలుపెట్టకుండానే కేవలం టీజర్ మాత్రం చిత్రీకరించి మార్కెట్ లోకి వదిలారు. మరి ఏ మేరకు బేరాలు వస్తున్నాయి అన్నది తెలియాల్సి వుంది.

లాభ నష్టాల సంగతి అలా వుంచితే గీతాకు సరైన హిట్ కావాలి. బ్లాక్ బస్టర్ సినిమా కావాలి. అందుకోసం తండేల్ ను నమ్ముకుంది. ఇది కనుక ఆ నమ్మకాన్ని నిలబెడితే మరో రెండు సినిమాలు చందు మొండేటివే అదే బ్యానర్ లో వున్నాయి. అలాగే బోయపాటి వున్నారు. ఫ్యామిలీ స్టార్ తో హిట్ కొడితే కనుక పరుశురామ్ రావాల్సి వుంటుంది.

ఇలాంటి నేపథ్యంలో తండేల్ ను గట్టిగా నమ్ముతున్నారు. ఆ సబ్జెక్ట్ క్లిక్ అవుతుందని నమ్మకంగా వున్నారు.