ఆపరేషన్ వాలంటైన్.. వరుణ్ తేజ్ తాజా చిత్రం ఇది. ఈ సినిమా పేరు చెప్పగానే హీరోయిన్ గా మానుషి ఛిల్లర్ పేరు మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆపరేషన్ వాలంటైన్ సినిమాలో రుహానీ శర్మ ఉంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
సినిమాలో మానుషి ఛిల్లర్ రాడార్ ఆఫీసర్ గా కనిపించనుండగా.. రుహానీ శర్మ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా, వరుణ్ తేజ్ టీమ్ లో కీలక సభ్యురాలిగా కనిపించనుంది. మూవీలో ఆమె పాత్ర పేరు తాన్యా శర్మ.
ఆపరేషన్ వాలంటైన్ సినిమాను మార్చి 1న విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. వరుణ్ తేజ్ కు తొలి హిందీ స్ట్రయిట్ సినిమా ఇది. ఈ మూవీ ప్రచారం కోసం అతడు ముంబయి వెళ్లాడు. అక్కడి మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలిచ్చాడు.
ఇటు తెలుగులో ఈ సినిమా నుంచి సాంగ్స్, కొన్ని పోస్టర్లు రిలీజ్ అవుతున్నాయి. వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో యూనిట్ ఫీల్డ్ లోకి దిగబోతోంది. ఆపరేషన్ వాలంటైన్ సినిమాను శక్తిప్రతాప్ సింగ్ డైరక్ట్ చేశాడు.
గతేడాది వరుణ్ తేజ్ కు అస్సలు కలిసిరాలేదు. గాండీవధారి అర్జున సినిమా ఫ్లాప్ అయింది. అదే ఏడాదిలో రిలీజ్ అవ్వాల్సిన ఆపరేషన్ వాలంటైన్ సినిమాను ఈ వేసవికి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపైనే వరుణ్ ఆశలన్నీ ఉన్నాయి.