ఈ బంధం ఇలానే కొనసాగనీ.. పవన్ కల్యాణ్

హెడ్డింగ్ మాత్రమే చదివినవాళ్లు పవన్-చంద్రబాబు బంధం అని అపార్థం చేసుకోవచ్చు. కానీ ఇది ఆ 'బంధం' కాదు. సినిమాలకు సంబంధించి కొన్ని బంధాల్ని బయటపెట్టారు పవన్. వివిధ సందర్భాల్లో వాళ్లతో కలిసి దిగిన ఫొటోలతో…

హెడ్డింగ్ మాత్రమే చదివినవాళ్లు పవన్-చంద్రబాబు బంధం అని అపార్థం చేసుకోవచ్చు. కానీ ఇది ఆ 'బంధం' కాదు. సినిమాలకు సంబంధించి కొన్ని బంధాల్ని బయటపెట్టారు పవన్. వివిధ సందర్భాల్లో వాళ్లతో కలిసి దిగిన ఫొటోలతో ఓ చిన్న వీడియో చేసి వదిలారు.

తాజాగా ఇనస్టాగ్రామ్ లోకి ఎంటరైన పవన్ కల్యాణ్, తన తొలి పోస్టుగా ఈ వీడియోను పోస్ట్ చేశారు. చిరంజీవి, బాలసుబ్రమణ్యం, కె.విశ్వనాధ్ లాంటి ప్రముఖులతో పాటు.. తన సహనటులు నాని, రానా, గోపీచంద్, నితిన్ లాంటి హీరోలతో దిగిన ఫొటోల్ని కూడా పొందుపరిచారు.

ఈ చిన్న వీడియోలో హీరోయిన్లకు కూడా చోటిచ్చారు పవన్ కల్యాణ్. ఇలియానా, తమన్న, భూమిక, నికీషా పటేల్ లాంటి చాలామంది హీరోయిన్లతో ఉన్న వర్కింగ్ స్టిల్స్ ను వీడియోలో పెట్టారు.

“ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై, ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుడ్ని” అంటూ తనదైన స్టేట్ మెంట్ కూడా జోడించారు.

ఇనస్టాలో తొలి పోస్టు కాబట్టి పవన్ ఇలా ఓ వీడియో చేసి వదిలి ఉండొచ్చు. కానీ దీనిపై మరో రకంగా చర్చ సాగుతోంది. ఇకపై పవన్ కల్యాణ్ కు సంబంధించిన సినిమా అప్ డేట్స్ అన్నీ ఇనస్టాగ్రామ్ లో వస్తాయని, ఈ వీడియో చూసిన  అభిమానులు పొంగిపోతున్నారు.

ట్విట్టర్ లో వ్యక్తిగతంగా ఓ ఎకౌంట్ కలిగి ఉన్నారు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత జనసేన ఎకౌంట్ నుంచి మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత ఎకౌంట్ నుంచి కూడా పొలిటికల్ ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు. తన సినిమాల అప్ డేట్స్ ను పూర్తిగా పక్కనపెట్టారు.

ఈ నేపథ్యంలో ఆయన ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేయడం, అందులో తొలి పోస్టుగా ఈ వీడియో పెట్టడంతో చాలామంది, పవన్ తన సినిమాల కోసం ఈ ఎకౌంట్ కేటాయించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఏ విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.