ఇచ్చాపురం బహు అచ్చాహై…!

రాజకీయ పార్టీలకు నేతలకు ఇచ్చాపురం బహు అచ్చాహై అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఈ ఇచ్చాపురం ఎక్కడ ఉంది అంటే ఒడిషా బోర్డర్ లో ఉంది. ఏపీకి ఒడిషాకు ఇదే సరిహద్దుగా ఉంటుంది. విశాఖకే కాదు…

రాజకీయ పార్టీలకు నేతలకు ఇచ్చాపురం బహు అచ్చాహై అన్నట్లుగా ఉంది. ఇంతకీ ఈ ఇచ్చాపురం ఎక్కడ ఉంది అంటే ఒడిషా బోర్డర్ లో ఉంది. ఏపీకి ఒడిషాకు ఇదే సరిహద్దుగా ఉంటుంది. విశాఖకే కాదు శ్రీకాకుళానికి చాలా దూరంలో ఉంటుంది. అలా ఉత్తరాంధ్రాలో చిట్ట చివరి ప్లేస్ అయిన ఇచ్చాపురం అంటే ఎందుకు నాయకులకు పార్టీలకు ఆసక్తి అంటే దాని వెనక చాలా పెద్ద కధే ఉంది.

ఇచ్చాపురంలో పాదం మోపితే విజయం ఖాయం అన్న సెంటిమెంట్ బలపడిపోతోంది. గతంలో వైఎస్సార్ కూడా చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేసి 2004లో ముఖ్యమంత్రి అయిపోయారు. అప్పటి అది అది పొలిటికల్ సెంటిమెంట్ గా మారింది. ఆయన తరువాత వైఎస్ షర్మిల కూడా ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేశారు. ఆమెలోని రాజకీయ నేత అలా బయటకు వచ్చారు.

వైఎస్ జగన్ ఇడుపుల పాయ టూ ఇచ్చాపురం అని 3 వేల 700 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ పార్టీలు దాంతో ఏ కార్యక్రమం మొదలెట్టాలన్నా ఇచ్చాపురానికే వెళ్తున్నారు. యువగళం పేరుతో కుప్పం టూ ఇచ్చాపురం దాకా నడవాలని లోకేష్ చూశారు. కానీ అది విశాఖతో ఆగింది. దాంతో లోకేష్ ఇపుడు ఇచ్చాపురం నుంచి శంఖారావం పేరుతో మరో కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు.

ఈ మధ్యనే కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ అయిన వైఎస్ షర్మిల కూడా ఇచ్చాపురం నుంచి తన జిల్లా టూర్లను ప్రారంభించారు. ఇలా రాజకీయ పార్టీల నేతలు అంతా ఇచ్చాపురం దాకా వెళ్తే తమ రాజకీయ ఇచ్చ తీరి కోరుకున్న సీటు దక్కుతుందని భావిస్తున్నారు. ఇచ్చాపురం మాత్రం ఇలా వస్తున్న నేతలను పార్టీలను చూస్తూనే ఉంది. ఇంతకీ రాజయోగం ఇచ్చాపురం నేలలో ఉందా రాజకీయ నేతల నుదిటి మీద ఉందా అంటే జవాబు దొరుకుతుందా అని అంటున్నారు.