కలెక్టరే వద్దు అంటూ టీడీపీ ఎమ్మెల్యే డిమాండ్!

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వింత డిమాండ్లు కొత్త డిమాండ్లు చాలానే వినాల్సి వస్తుందేమో. ఇప్పటిదాకా దిగువ స్థాయి అధికారుల విషయంలో ఆరోపణలు చేయడం చూస్తూ వచ్చారు. ఇపుడు ఒక జిల్లా కలెక్టర్ నే తప్పించేయమంటున్నారు.…

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వింత డిమాండ్లు కొత్త డిమాండ్లు చాలానే వినాల్సి వస్తుందేమో. ఇప్పటిదాకా దిగువ స్థాయి అధికారుల విషయంలో ఆరోపణలు చేయడం చూస్తూ వచ్చారు. ఇపుడు ఒక జిల్లా కలెక్టర్ నే తప్పించేయమంటున్నారు. ఆయన మాకు వద్దు అంటున్నారు.

టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుకు ఎక్కిన తూర్పు అసెంబ్లీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ కలెక్టర్ ని పట్టుకుని వైసీపీ మనిషి అంటున్నారు. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరుతున్నారు.

దీని మీద రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని అక్కడ కూడా యాక్షన్ లేకపోతే కోర్టుని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చెప్పినా అధికారులు స్పందించడం లేదని వెలగపూడి ఆరోపిస్తున్నారు. విశాఖ తూర్పులో వేలలలో దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ అంటూంటే వైసీపీ కూడా అదే అంటోంది.

అసలు ఓట్ల కంటే నకిలీ ఓట్లతోనే వైసీపీ గెలుస్తోంది అన్నది వైసీపీ ఆరోపణ. ఇలా రెండు పార్టీలు ఎన్నికల సంఘానికి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేశాయి. దాని మీద పలు మార్లు విచారణ చేశామని దొంగ ఓట్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని వెలగపూడి అంటున్నారు.

టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తీసేస్తున్నారు అని ఆ పార్టీ అంటే నియోజకవర్గానికి సంబంధం లేని వారు ఓటర్లుగా ఉంచారని వైసీపీ అంటోంది. ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారింది. అధికారులు ప్రతీ ఇంటికీ వెళ్ళి విచారించామని చెబుతున్నారు. గత ఏడాదిగా ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ విపక్షాలు యాగీ చేస్తూంటే అధికార వైసీపీ కూడా ఆలస్యంగా అయినా మేలుకుని కౌంటర్ ఎటాక్ చేస్తోంది. 

అధికారులు మాత్రం అంతా చక్కదిద్దామని అంటున్నారు. అయినా సమస్య ఉందని టీడీపీ అంటోంది అంటే మ్యాటర్ ఎక్కడ సీరియస్ అన్నది ఆలోచించాలని అంటున్నారు. కలెక్టర్ నే వద్దు అని అనడం, ఒక పార్టీ మనిషి అని ముద్ర వేయడం అంటే ఈ విషయం తేల్చాల్సిందే అంటున్నారు.