ఏం ఖర్మరా బాబూ.. ఈయన కూడా సర్వే చేశాడట!

రానురాను సర్వేలు కామెడీ అయిపోతున్నాయి. ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు అంకెలు చెప్పుకోవడం, సర్వే అనే పదం వాడేయడం కామన్ అయిపోయింది. దీంతో నిజమైన సర్వే ఎవరు చేయించారు, అదేంటి అనేది ప్రజలకు అర్థంకాని పరిస్థితి.…

రానురాను సర్వేలు కామెడీ అయిపోతున్నాయి. ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు అంకెలు చెప్పుకోవడం, సర్వే అనే పదం వాడేయడం కామన్ అయిపోయింది. దీంతో నిజమైన సర్వే ఎవరు చేయించారు, అదేంటి అనేది ప్రజలకు అర్థంకాని పరిస్థితి.

కామెడీ ఏంటంటే.. సినీనటుడు, జనసేన కార్యకర్త '30 ఇయర్స్' పృధ్వీ కూడా సర్వే చేయించాడట. ఆయన లెక్కలు ఆయనవి. ఎవరు నవ్వితే నాకేంటి, ఇది నా సర్వే అంటున్నారాయన.

“శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు చూశాను. అంతా ఒకటే చెబుతున్నారు. 136 అసెంబ్లీ స్థానాలు, 21 పార్లమెంట్ స్థానాల్ని టీడీపీ-జనసేన కూటమి గెలుచుకుంటుంది. ఇది పక్కా. సీ-ఓటర్ సర్వే కూడా నా సర్వేకు దగ్గరదగ్గరగా వచ్చారు.”

ఇదీ పృధ్వీ సర్వే. ఆ మిగిలిన ఎంపీ స్థానాలు ఎందుకు వదిలేశాడో పాపం. ఇలా తన సర్వే ఫలితాల్ని ఘనంగా ప్రకటించుకున్న పృధ్వీ, పనిలోపనిగా వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు. దరిద్రుడు, పనిలేక గాలికితిరిగే ఓ పాత్ర ఉంది చేయమని సముద్రఖని అడిగితే చేశానని.. అయితే తను ఊహించిన దానికంటే శ్యాంబాబు పరమ దరిద్రుడని అన్నాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల రోజున ఫట్ మంటూ పడే తొలి వికెట్ రోజాదే అన్నాడు వృధ్వీ.

Comments are closed.