జగన్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య కొట్లాట

ప్రసాద్స్ ఐమ్యాక్స్.. ప్రతి శుక్రవారం ఇక్కడ సినీ పండగ కనిపిస్తుంది. పెద్ద సినిమాలు రిలీజైతే థియేటర్ బయట ఓ మోస్తరు తొక్కిసలాట, దొమ్మీ కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఏకంగా థియేటర్ లోపలే కొట్లాట జరిగింది.…

ప్రసాద్స్ ఐమ్యాక్స్.. ప్రతి శుక్రవారం ఇక్కడ సినీ పండగ కనిపిస్తుంది. పెద్ద సినిమాలు రిలీజైతే థియేటర్ బయట ఓ మోస్తరు తొక్కిసలాట, దొమ్మీ కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఏకంగా థియేటర్ లోపలే కొట్లాట జరిగింది. ఈమధ్య కాలంలో ప్రసాద్స్ థియేటర్ లోపల ఇలా గొడవ జరగడం ఇదే తొలిసారి.

ఈరోజు యాత్ర-2 రిలీజైంది. ఈ సందర్భంగా థియేటర్లో కొంతమంది గొడవ పడ్డారు. ఓవైపు సినిమా రన్ అవుతుంటే, మరోవైపు వీళ్లు చొక్కాలు చించుకున్నారు. ఓ రేంజ్ లో కొట్టుకున్నారు. వెంటనే రియాక్ట్ అయిన సిబ్బంది, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యాత్ర-2 సినిమాలో ఓ కీలకమైన సన్నివేశం వచ్చినప్పుడు గుంపులోంచి ఎవరో వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంట. అసలే థియేటర్ మొత్తం జగన్ ఫ్యాన్స్ తో నిండిపోయింది. అలాంటి టైమ్ లో యాంటీ-కామెంట్స్ రావడంతో గొడవ మొదలైంది.

అలా అభ్యంతరకరంగా కామెంట్ చేసిన వాళ్లు పవన్ అభిమానులని కొంతమంది, షర్మిల అభిమానులని మరికొంతమంది చర్చించుకోవడం కనిపించింది. అయితే జరిగిన ఘటనపై అధికారికంగా ఎవ్వరూ స్పందించలేదు.

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులందరూ యాత్ర 2 సినిమా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించినట్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పేరుతో జారీ చేసిన నకిలీ జీవో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. యాత్ర 2 చిత్రాన్ని చూడాలని అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వార్డు/గ్రామ వాలంటీర్లను తప్పనిసరి చేస్తూ కలెక్టర్‌లు, స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఇందులో ఉంది. దీన్ని నకిలీ జీవోగా స్పష్టం చేసింది వైసీపీ.