భారీ డైలాగులు.. అందుకే వాయిస్ మార్చారు

రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న లాల్ సలామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ చూసిన జనమంతా షాక్. ఎందుకంటే, అందులో రజనీకాంత్ గొంతు మారిపోయింది. Advertisement…

రజనీకాంత్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న లాల్ సలామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ చూసిన జనమంతా షాక్. ఎందుకంటే, అందులో రజనీకాంత్ గొంతు మారిపోయింది.

సాధారణంగా రజనీకాంత్ సినిమా తెలుగులోకి వస్తుందంటే, దానికి మనో డబ్బింగ్ చెప్పాల్సిందే. అంతలా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. మనో వాయిస్ కూడా రజనీ స్టయిల్ కు బాగా సింక్ అయింది. కానీ లాల్ సలామ్ లో మాత్రం రజనీ పాత్రకు సాయికుమార్ తో డబ్బింగ్ చెప్పించారు.

ట్రయిలర్ లో రజనీకాంత్, సాయికుమార్ గొంతుతో మాట్లాడుతుంటే చాలామందికి నచ్చలేదు, మరికొంతమంది కొత్తగా ఫీలయ్యారు. ఉన్నఫలంగా సాయికుమార్ ను ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనేది అందరి ప్రశ్న.

నిజానికి రజనీకాంత్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం కొత్తకాదు. పెదరాయుడు సినిమాలో రజనీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఈయనే. మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ స్టార్ కు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడానికి ఓ కారణం ఉంది.

లాల్ సలామ్ లోని ప్రత్యేక పాత్రలో రజనీకాంత్ కొన్ని భారీ డైలాగ్స్ చెప్పారట. అందులో కొన్ని ఆవేశపూరిత డైలాగ్స్ కూడా ఉన్నాయట. వాటిని రెగ్యులర్ గా మనోతో చెప్పించే కంటే, సాయికుమార్ తో చెప్పిస్తే బాగుంటుందని యూనిట్ భావించిందట. 

సమాజానికి సందేశాన్నిచ్చే అలాంటి డైలాగ్స్ ను సాయికుమార్ తో చెప్పిస్తేనే బాగుంటుందని, పైగా రజనీది ఇందులో హుందాతనం ఉట్టిపడే పాత్ర కాబట్టి, సాయికుమార్ వాయిస్ సరిగ్గా సూట్ అవుతుందని అనుకున్నారట. అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత సాయికుమార్ తో డబ్బింగ్ చెప్పించారట. అదీ సంగతి.