గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. విశ్వక్ సేన్ కు ఓ సరికొత్త అనుభవం అందించిన సినిమా. ఇన్నాళ్లూ ఇలా షూట్ చేశామా, అలా విడుదల చేశామా అన్నట్టుండేది విశ్వక్ వైఖరి. పోటీలో ఎవరున్నా లేకున్నా ఇతడి తీరు ఇదే. అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయంలో మాత్రం విశ్వక్ ఏం చేయలేకపోతున్నాడు.
పెద్ద ప్రొడ్యూసర్ చేతిలో ఉన్న సినిమా. పైగా ఒకేసారి 2 సినిమాలు చేస్తుండడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పటికే 2సార్లు వాయిదా పడింది. ఈసారి ఏకంగా తనే సినిమానే తనకు పోటీగా మారడంతో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని మరోసారి వాయిదా వేయక తప్పని పరిస్థితి.
రీషూట్స్ వల్ల ఈ సినిమా వాయిదా పడుతుందనే గాసిప్ ఉంది. దీన్ని విశ్వక్ ఒప్పుకోవడం లేదు. తన సినిమాకు రీషూట్స్ జరగడం లేదని, డెకరేషన్ జరుగుతుందని అంటున్నాడు.
“రీషూట్ కాదు, బ్యాలెన్స్ షూట్ అవుతోంది. ఐటెంసాంగ్ లో రీప్లేస్ మెంట్ చేశాం. దీంతో పాటు చిన్న చిన్న డెకరేషన్లు, టచప్ లు చేస్తున్నాం. ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ కు వెళ్లాలంటే మీసం బాగా పెంచాల్సి వస్తోంది. అందుకే టైమ్ పడుతోంది.”
ఇలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై స్పష్టత ఇచ్చాడు విశ్వక్. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఆ తేదీకి తను నటిస్తున్న గామి సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు విశ్వక్.