Advertisement

Advertisement


Home > Politics - Gossip

గంటా మంత్రాంగం- నాగబాబు ప్లానింగ్

గంటా మంత్రాంగం- నాగబాబు ప్లానింగ్

జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో ఇంకా తేలలేదు. బాబు-పవన్‌ల తొలి విడత సమావేశం మాత్రం ముగిసింది. కానీ పవన్ సోదరుడు నాగబాబుకు మాత్రం ఫుల్ క్లారిటీ వుంది ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద. ముఖ్యంగా తను ఈసారి తన అదృష్టాన్ని అనకాపల్లి నుంచి పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు.

కాపులు ఎక్కువగా వుండే నరసాపురం నుంచి పోటీ చేసి భంగపడ్డారు. ఈ సారి అనకాపల్లికి వలస వచ్చారు. కొణతాల రామకృష్ణను జనసేన లోకి తీసుకుంటే ఎంపీ అభ్యర్ధిగా నిలబెడతారు అనుకున్నారు అంతా. కానీ కాదని ఇప్పుడు తేలిపోయింది. కేవలం నాగబాబుకు బలం చేకూర్చడం కోసం కొణతాలను పార్టీలోకి తీసుకున్నారన్న మాట.

ఏ ఎమ్మెల్సీనో, మరోటో హామీ ఇచ్చి వుంటారు. అది వేరే సంగతి. అధికారికంగా ప్రకటించకుండానే నాగబాబు అనకాపల్లి వచ్చేసారు. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఎంపీ టికెట్ ఆశిస్తున్న అయ్యన్న పాత్రుడి కొడుకును అనకాపల్లి పిలిపించి బుజ్జగించే పని మొదలుపెట్టారు.

అయ్యన్నకు గంటాకు ఉప్పు.. నిప్పు అన్న సంగతి తెలిసిందే. గంటానే చక్రం తిప్పి, నాగబాబును అనకాపల్లికి వలస వచ్చేలా చేసినట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో తనకు పట్టు వుందని, గెలిచేలా చేస్తానని మాట ఇచ్చినట్లు బోగట్టా. అదే నియోజకవర్గంలోని చోడవరం నుంచి గంటా పోటీ చేయాలనుకుంటున్నారు.

జనసేన నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో చెప్పడం లేదు. కానీ నాగబాబు మాత్రం ఆదికి ముందే పని మొదలుపెట్టారు. అంటే జనసేన ఆశ్రితులు వేరు. నాగబాబు వేరు అన్న మాట. గతంలో అల్లు అరవింద్ ప్రజారాజ్యం టైమ్ లో గంటా ను నమ్మే ఇక్కడ నుంచి పోటీ చేసారు. సబ్బం హరి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు నాగబాబు ఏం చేస్తారో చూడాలి.

వైకాపా ఇంకా తన అభ్యర్ధిని ప్రకటించలేదు. ఇప్పుడు నాగబాబు పేరు బయటకు వచ్చేసింది కనుక జగన్ సరైన ఎత్తుగడే వేస్తారు. సరైన అభ్యర్ధినే రంగంలోకి దింపుతారు. అందులో సందేహం లేదు. మొత్తానికి ఆట రంజుగా వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?