Advertisement

Advertisement


Home > Politics - National

వాలంటైన్స్ వీక్.. ఏ రోజు ఏం చేయాలి?

వాలంటైన్స్ వీక్.. ఏ రోజు ఏం చేయాలి?

ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే. ప్రేమికులు పండగ చేసుకునే రోజు. అయితే లెక్కప్రకారం, ఫిబ్రవరి 14 మాత్రమే వాలంటైన్స్ డే కాదు. ఆ రోజు ఉన్న వారం మొత్తాన్ని వాలంటైన్స్ డే వీక్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ వారం ఈ రోజు నుంచి మొదలైంది. అంటే, ఈరోజు నుంచి లవర్స్ తమ ఇష్టాన్ని ఒక్కో విధంగా ప్రదర్శించవచ్చన్నమాట.

ఈరోజు నుంచి రోజుకో స్పెషల్ డే అన్నమాట. ఫిబ్రవరి 7వ తేదీ రోజ్ డే అని పిలుస్తారు. అంటే, లెక్క ప్రకారం ప్రేయసికి ఈరోజు రోజా పువ్వు ఇవ్వాలి. ఇక ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9న చాక్లెట్ డే, ఫిబ్రవరి 10న టెడ్డీ డే, ఫిబ్రవరి 11న ప్రామిస్ డే, ఫిబ్రవరి 12న హగ్ డే, ఫిబ్రవరి 13న కిస్ డే ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ఒకే రోజు, అంటే ఫిబ్రవరి 14న సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇలా వాలంటైన్స్ వారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంట. ఒక రోజు పువ్వు ఇచ్చి, మరో రోజు చాక్లెట్ ఇచ్చి, ఇంకో రోజు కిస్ ఇచ్చి.. ఇలా రోజుకో విధంగా సెలబ్రేట్ చేసుకోవాలంట. ఇక ఏ రోజు ఏ పువ్వు ఇవ్వాలి, ఏ రంగు గులాబీకి ఏంటి అర్థం అనే వివరణలు కూడా ఉన్నాయి. ఎదుటి వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి, వివిధ రంగుల గులాబీలున్నాయి.

సాధారణంగా అంతా ఎరుపు రంగు గులాబీలు ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ దీనికి అసలైన అర్థం ఏంటంటే.. ఎవరికైనా రెడ్ రోజ్ ఇస్తే శృంగార వ్యక్తీకరణ అని అర్థం. రెడ్ రోజ్ అనేది శృంగారానికి గుర్తుగా భావిస్తుంటారు.

ఆరెంజ్ గులాబీ ఇస్తే, అప్పటివరకు ఎదుటి వ్యక్తితో ఉన్న బంధాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నట్టు అర్థం. ఉదాహరణకు స్నేహితులుగా ఉన్న ఇద్దరు ప్రేమికులాగా మారాలనుకున్నప్పుడు ఆరెంజ్ గులాబీ ఇచ్చిపుచ్చుకుంటారు.

ఇలా ఆరెంజ్ రోజ్ ఇవ్వడానికి కూడా మొహమాటపడితే పీచ్ కలర్ రోజా పువ్వు ఇవ్వొచ్చు. దీని అర్థం ఏంటంటే.. పరోక్షంగా ప్రేమను వెల్లడిస్తున్నట్టు అర్థం అన్నమాట. ముందుగా పీచ్ కలర్ రోజా ఇచ్చి, ఆ తర్వాత కావాలంటే ఆరెంజ్ ఇవ్వొచ్చు.

మరి తొలిచూపులోనే ప్రేమలో పడితే ఏం చేయాలి. ఇలా తొలిచూపులోనే ప్రేమలో పడిన కుర్రాళ్లు, సదరు అమ్మాయికి లేత ఊదా రంగు గులాబీ ఇవ్వాలంట. ఇక ప్రేమలో పడిన తర్వాత, భాగస్వామి తమకు చాలా ముఖ్యం, ఎంతో విలువైన వ్యక్తి అనే చెప్పడానికి పింక్ కలర్ రోజా ఇవ్వాలి.

ఇక వీటన్నింటిలోకంటే తెల్ల గులాబీ అతి ముఖ్యమైనది. ఆల్రెడీ ప్రేమలో ఉండి, అక్కడ్నుంచి తమ బంధాన్ని పెళ్లి వైపు తీసుకెళ్లాలనుకునేవాళ్లు ఈ గులాబీని ఎంచుకోవాలి. ఇది ఇస్తే, నీతో భవిష్యత్తును గడపాలనుకుంటున్నానని, నువ్వు నా జీవితంలో సగభాగం అని అర్థం అంట. ఇది వాలంటైన్స్ వీక్ వెనక ఉన్న మర్మం. ఇప్పటి కుర్రకారుకు ఈ విషయాలు పెద్దగా తెలియవు. ఎర్ర గులాబీ ఇవ్వడం, అట్నుంచి అటు ఏ పార్క్ కో, థియేటర్ కో తీసుకెళ్లడం కామన్ అయిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?