హనుమాన్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా 25 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, 300 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 25 రోజుల్లో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలై 3 వారాలు దాటినా ఇప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్ లోని కొన్ని లొకేషన్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ వీకెండ్ కూడా నడిస్తే, మరిన్ని వసూళ్లు రావడం ఖాయం.
భారీ పోటీ మధ్య సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ప్రారంభంలో థియేటర్లు కూడా దొరకని స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంది.
ఓవర్సీస్ లో ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. స్టార్ హీరోలకు 4 మిలియన్ డాలర్లు టచ్ చేయడమే కష్టం అనుకుంటున్న పరిస్థితుల్లో హనుమాన్ ఏకంగా 5 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరింది. ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్ లో రాజమౌళి సినిమాలు, ప్రభాస్ సినిమాల తర్వాత ఓవర్సీస్ లో ఈ సినిమాదే పైచేయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకుల్ని కూడా మెప్పించింది. ఒక దశలో ఫైటర్ సినిమాతో సమానంగా నిలిచి, ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది.