సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హీరోయిన్

కొందరు హీరోయిన్ల కెరీర్ ఎలా క్లోజ్ అవుతుందో అస్సలు ఊహించలేం. అవకాశాలు లేక చాలామంది హీరోయిన్లు తమ కెరీర్లు చాలిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం కావాలనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుంటారు. హీరోయిన్…

కొందరు హీరోయిన్ల కెరీర్ ఎలా క్లోజ్ అవుతుందో అస్సలు ఊహించలేం. అవకాశాలు లేక చాలామంది హీరోయిన్లు తమ కెరీర్లు చాలిస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం కావాలనే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుంటారు. హీరోయిన్ మెహ్రీన్ ఈ రెండో టైపు. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో అంతోఇంతో క్రేజ్ ఉంది. కానీ దాన్ని కాదని, సినిమాలు వదులుకోవడానికి సిద్ధపడింది ఈ బ్యూటీ.

నిన్ననే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది మెహ్రీన్. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ కొడుకు భవ్య బిష్ణోయ్ ను ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. వచ్చేనెల 12న వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరగనుంది. ఇదే ఏడాది ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.

అయితే అందరు హీరోయిన్లలా పెళ్లి తర్వాత కెరీర్ కొనసాగించాలనుకోవడం లేదు మెహ్రీన్. పెళ్లితో కెరీర్ కు విరామం ఇవ్వాలని భావిస్తోంది. అందుకే ఆమె ఎఫ్3 మినహా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎఫ్3నే ఆమె ఆఖరి సినిమా అని స్వయంగా ఆ యూనిట్ సభ్యులే చెబుతున్నారు.

కాజల్, సమంత, శ్రియ, ప్రియమణి.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తమ మనసుకు నచ్చిన సినిమాలు చేస్తున్నారు. కానీ మెహ్రీన్ మాత్రం క్రేజ్ ఉన్నప్పటికీ సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంది. బహుశా.. ఇది మెహ్రీన్-భవ్య కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్న నిర్ణయం కావొచ్చు. 

ఉప్పెనంత వసూళ్లు

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు