ఒక్కపాటకు 75 ట్యూన్లు

కొందరు డెైరక్టర్లు ఒక పట్టాన రాజీ పడరు. వాళ్లకు కావాల్సింది, వాళ్లు అనుకున్నది వచ్చేవరకు ప్రయత్నిస్తూనే వుంటారు. వన్ మోర్ టేక్ లేదా ట్రయిల్స్ అంటూనే వుంటారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వ్యవహారం కూడా…

కొందరు డెైరక్టర్లు ఒక పట్టాన రాజీ పడరు. వాళ్లకు కావాల్సింది, వాళ్లు అనుకున్నది వచ్చేవరకు ప్రయత్నిస్తూనే వుంటారు. వన్ మోర్ టేక్ లేదా ట్రయిల్స్ అంటూనే వుంటారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వ్యవహారం కూడా ఇలాంటిదే. 

హీరో నితిన్ తో చెక్ అనే సినిమా చేస్తున్నారు. భవ్య సంస్థ నిర్మించే ఈ సినిమాలో ఒకే ఒక పాట వుంటుంది. దాని కోసం 75 ట్యూన్లు వినిపించాల్సి వచ్చిందట సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ కు.

సంగీత దర్శకుడు కీరవాణికి స్వయానా సోదరుడు అయిన కళ్యాణ్ మాలిక్ మంచి టాలెంట్ వున్న వ్యక్తి. ఎన్నో మంచి పాటలు అందించాడు. కానీ ఎందుకనో రావాల్సినన్ని అవకాశాలు రాలేదు. ఆయనే చెక్ కు మ్యూజిక్ డైరక్టర్. 

సినిమాలో వున్న ఒక్క రొమాంటిక్ సాంగ్ కోసం 75 ట్యూన్లు వినిపిస్తే కానీ చంద్రశేఖర్ యేలేటి సంతృప్తి చెందలేదని ఆయనే వెల్లడించాడు.

సినిమాలో బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చాలా కీలకంగా వుంటుందని, సినిమా మొత్తం మీద ఒకే ఒక పాటకు స్కోప్ వుందని, అది కూడా కావాలని పెట్టినది కాదని వివరించారు. 

అలాగే నేపథ్య సంగీతం చేయడానికి ముఫై రోజులు టైమ్ పట్టిందని, ఇన్ని రోజులు వర్క్ చేయడం ఇదే తొలిసారి అని ఆయన వెల్లడించారు.

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

ఉప్పెనంత వసూళ్లు