కారు కావాలా..ఇల్లు కావాలా?

మైత్రీ మూవీస్ బ్యానర్ కు మరో మెమరబుల్ హిట్ వచ్చింది ఉప్పెన సినిమాతో.  సవ్యసాచి, డియర్ కామ్రేడ్ సినిమాలు కోట్ల డబ్బులు పట్టుకుపోతే, ఉప్పెన కోట్లు తీసుకువచ్చింది. Advertisement సవ్యసాచి, డియర్ కామ్రేడ్ దర్శకులు…

మైత్రీ మూవీస్ బ్యానర్ కు మరో మెమరబుల్ హిట్ వచ్చింది ఉప్పెన సినిమాతో.  సవ్యసాచి, డియర్ కామ్రేడ్ సినిమాలు కోట్ల డబ్బులు పట్టుకుపోతే, ఉప్పెన కోట్లు తీసుకువచ్చింది.

సవ్యసాచి, డియర్ కామ్రేడ్ దర్శకులు ఇద్దరూ బంగారం లాంటి చాన్స్ లు వృధా చేసుకుంటే బుచ్చిబాబు దాన్ని నిచ్చెన చేసుకున్నాడు. అందుకే మైత్రీ మూవీస్ అధినేతలు బుచ్చిబాబుకు ఓ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరో సినిమా ఆఫర్ కాదు. అది ఎలాగూ వుంది. మైత్రీలో రెండో సినిమా ఆ తరువాత సితార లో మూడో సినిమా. ఈ ఆఫర్ వేరు. సాధారణంగా పెద్ద హిట్ ఇస్తే డైరక్టర్లకు నిర్మాతలు కారు కొనిస్తుంటారు.

ఛలో వెంకీకి, ప్రతి రోజూ పండగే తరువాత మారుతికి ఇలా చాలా మందికి వచ్చాయి. మైత్రీ మూవీస్ కూడా బుచ్చిబాబును కారు కావాలా? లేదా ఫ్లాట్ కావాలా? అని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏదయిన కోటి రూపాయలకు తక్కువ వుండదు. బుచ్చిబాబు కు టాలెంట్, అదృష్టం రెండూ పుష్కలంగా వున్నట్లుంది. 

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

ఉప్పెనంత వసూళ్లు