తన అలవాట్లు, అభిరుచులు, వ్యక్తిగత విషయాల్ని ఎప్పటికప్పుడు బయటపెట్టే శృతిహాసన్.. ఈసారి మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. కారు డ్రైవింగ్ లో తను వరస్ట్ అంటోంది. వరల్డ్ హిస్టరీలోనే తనంత చెత్త డ్రైవర్ ఎవ్వరూ ఉండరని ఓపెన్ గా చెబుతోంది.
“డ్రైవింగ్ లో నా అంత వరస్ట్ గా ప్రపంచ చరిత్రలోనే ఎవ్వరూ ఉండరేమో. నేను అంత చెత్తగా డ్రైవ్ చేస్తాను. అందుకే అత్యవసరమైతే తప్ప నేను కారు నడపను. ఒకవేళ సరదాగా డ్రైవ్ చేయాలనిపిస్తే నా ఎరుపు రంగు రేంజ్ రోవర్ వెలార్ ను డ్రైవ్ చేయడానికి ఇష్టపడతాను.”
మరోవైపు సంప్రదాయ కార్ల కంటే, ఎలక్ట్రిక్ కార్లు అంటే తనకు ఇష్టమంటోంది శృతిహాసన్. పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అభిప్రాయానికొచ్చినట్టు చెబుతోంది.
“ఎలక్ట్రిక్ కార్లు, ఇంధన కార్లలో నన్ను సెలక్ట్ చేసుకోమంటే నేను కచ్చితంగా ఎలక్ట్రిక్ కారునే ఎంచుకుంటాను. ఇందులో మరో ఆలోచనకు తావులేదు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల బట్టి చూసుకుంటే, పర్యావరణ హితం కోసం అందరూ ఎలక్ట్రిక్ కార్లే వాడాలి.”
అయితే ఇంత చెప్పుకొచ్చిన శృతిహాసన్ దగ్గర ఎలక్ట్రిక్ కారు లేదు. త్వరలోనే తను ఎలక్ట్రిక్ కారు సెగ్మెంట్ వైపు మారతానని చెబుతోంది ఈ బ్యూటీ.