ఓటీటీలోకి గుంటూరు కారం.. కొత్త డిమాండ్స్

మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చి, ప్రస్తుతం పడుతూలేస్తూ సాగుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా…

మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చి, ప్రస్తుతం పడుతూలేస్తూ సాగుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే ప్రచారం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ మరోసారి అలర్ట్ అయ్యారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమాను తమ భుజాలపైకెత్తుకొని ప్రచారం చేసిన అభిమానులు, ఇప్పుడు ఓటీటీ కోసం సరికొత్త డిమాండ్స్ ను తెరపైకి తెస్తున్నారు.

గుంటూరుకారం సినిమా కోసం చాలా సన్నివేశాలు తెరకెక్కించి పక్కనపెట్టారు. రీ-రికార్డింగ్ పూర్తయిన తర్వాత కూడా కొన్ని సీన్లు తొలిగించారు. అలా డిలీట్ చేసిన సన్నివేశాల్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేయమని కోరుతున్నారు ఫ్యాన్స్. దీంతో పాటు సినిమా అన్-కట్ వెర్షన్ ను కూడా స్ట్రీమింగ్ కు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు లియో, యానిమల్ సినిమాలు ఇలానే వచ్చాయి.

అయితే ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందు గుంటూరుకారం ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను విడుదల చేయమని ఫ్యాన్స్ కోరుతున్నారు. త్వరలోనే గుంటూరుకారం స్ట్రీమింగ్ డేట్ బయటకు రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.