ఓజి.. పవన్ ఫస్ట్ ప్రయారిటీ

సినిమాల వరకు వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్రయారిటీ ఓజి సినిమానే అంట. ఎన్నికలు కాగానే ఓజి సినిమా మీదకు వచ్చి పూర్తి చేస్తాన‌ని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓజి…

సినిమాల వరకు వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్రయారిటీ ఓజి సినిమానే అంట. ఎన్నికలు కాగానే ఓజి సినిమా మీదకు వచ్చి పూర్తి చేస్తాన‌ని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓజి సినిమా 72 పర్సంట్ పూర్తయింది. పవన్ 15 నుంచి 20 రోజులు డేట్ లు ఇస్తే చాలు పూర్తయిపోతుంది.

ఓజి సినిమాకు క్రేజ్ బాగా వుంది. సుజిత్ దర్శకుడు కావడం, పవన్ చేసే యాక్షన్ సినిమా కావడంతో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది. ఇప్పటికే ఓవర్ సీస్ రైట్స్ అమ్మేసారు. 17 కోట్లకు విక్రయిచినట్లు తెలుస్తోంది.

గమ్మత్తేమిటంటే అడియో అండ్ విజువల్ రైట్స్ అంతకన్నా ఎక్కువ రావడం. 20 కోట్ల మేరకు సోనీ సంస్థకు విక్రయించినట్లు తెలుస్తోంది.

అందువల్ల అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ లో ఓజి సినిమా విడుదల వుండొచ్చు. పుష్ప 2 ఆ డేట్ కు రాదు అని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ డేట్ ను టెంపరరీగా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.