ఆ హీరోయిన్ కు ఇదే చివరాఖరి అవకాశం

రెజీనా తెలుగుతెరపై మెరిసి చాలా కాలమైంది. ఒకప్పుడు కుర్ర హీరోల హాట్ ఫేవరెట్ గా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఏ హీరోకు అక్కర్లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరోసారి తెలుగు…

రెజీనా తెలుగుతెరపై మెరిసి చాలా కాలమైంది. ఒకప్పుడు కుర్ర హీరోల హాట్ ఫేవరెట్ గా ఉన్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఏ హీరోకు అక్కర్లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ మరోసారి తెలుగు తెరపైకి వస్తోంది.

రెజీనా నటించిన మరో సినిమా ఉత్సవం. త్వరలోనే థియేటర్లలోకి రానుంది ఈ మూవీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. రంగస్థలం, నాటకాలు నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్టు టీజర్ చూస్తే అర్థమౌతోంది.

ఎప్పట్లానే టీజర్ లో రెజీనా అందంగా కనిపించింది. ఆమెకు మంచి రోల్ కూడా దక్కినట్టు కనిపిస్తోంది. మరి ఈ సినిమా అయినా ఆమెకు తెలుగులో మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.

గతేడాది రెజీనా నుంచి 'నేనేనా' అనే సినిమా వచ్చింది. అది ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవ్వరికీ తెలియదు. అంతకంటే ముందు చేసిన శాకినీ-డాకినీ సినిమా కూడా ఆమెకు కలిసిరాలేదు.

అలా ఏడాదికో సినిమాతో వస్తూ తెలుగులో ఫ్లాప్స్ చవిచూస్తున్న ఈ హీరోయిన్, ఈ ఏడాది ఉత్సవం సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ సినిమా అయినా ఆమె కెరీర్ కు కలిసిరావాలని కోరుకుందాం.