ఆ దర్శకుడే వద్దనుకుంటే ఇప్పుడు హీరోయిన్ కూడా..!

కొన్ని రోజుల కిందటి సంగతి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడనేది న్యూస్. దానిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర విముఖత వ్యక్తం చేశారు. సీతారామం లాంటి సినిమాతో హిట్ కొట్టినప్పటికీ,…

కొన్ని రోజుల కిందటి సంగతి. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడనేది న్యూస్. దానిపై ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర విముఖత వ్యక్తం చేశారు. సీతారామం లాంటి సినిమాతో హిట్ కొట్టినప్పటికీ, మాస్ అపీల్ కు దూరంగా సినిమాలు తీసే హను రాఘవపూడితో మాస్ హీరో ప్రభాస్ సినిమా అంటే ఇష్టపడలేదు చాలామంది.

అదే వద్దనుకుంటే, ఇప్పుడు ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పించేలా మరో మేటర్ బయటకొచ్చింది. ఈ ప్రాజెక్టులో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటున్నారనేది తాజా టాక్.

ప్రభాస్ తో సినిమా కోసం సైలెంట్ గా వర్క్ స్టార్ట్ చేసిన హను రాఘవపూడి, హీరోయిన్ రోల్ కోసం శ్రీలీలను సంప్రదించాడంట. దీంతో ఫ్యాన్స్ మరోసారి భగ్గుమంటున్నారు. ఆ దర్శకుడే వద్దనుకుంటుంటే, ఇప్పుడు హీరోయిన్ కూడానా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

శ్రీలీల కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. గుంటూరుకారం లాంటి పెద్ద సినిమా ఆమెకు హెల్ప్ కాలేదు సరికదా, నెగెటివ్ సెంటిమెంట్ ను కూడా ఎగదోసింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీలీలను వద్దంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

అయితే ప్రభాస్ ఇలాంటివి పట్టించుకోడనే సంగతి తెలిసిందే. గతంలో మారుతితో సినిమా చేయొద్దంటూ డిమాండ్ చేశారు ఫ్యాన్స్. కానీ అదే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు హను రాఘవపూడికి అవకాశం ఇచ్చాడు. హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు.