నిజానికి తెలంగాణ షర్మిల గురించి చర్చించే దృశ్యం ఏపీ ప్రజలమైన మనకు లేదు. కానీ రోజురోజుకూ ఆమె స్వరం మారుతున్నది కాబట్టి, మనమూ స్పందించాల్సి వస్తున్నది!
కాంగ్రెస్ గురించి ఆమె 9 సంవత్సరాల పాటు చేయని విమర్శ లేదు. చంద్రబాబును, తాజాగా రేవంత్ రెడ్డిని ఆమె అనని మాట లేదు. ఆ రెండు పార్టీల వారికి ఆమె దీనిపై క్షమాపణ చెప్పరా?
అధిష్టానాన్ని ధిక్కరించిన జగన్‌కు తోడుగా నిలిచి, శాసనసభ సభ్యత్వాన్ని వదిలేసుకున్న మొదటి ఎమ్మెల్యే రాయచోటి శ్రీకాంత్ రెడ్డి.'వద్దు శ్రీకాంత్, నాతో రావొద్దు, నీ భవిష్యత్తును ఫణంగా పెట్టొద్దు, నా భవిష్యత్తు ఎట్లుంటుందో చెప్పలేను. నాన్న కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇచ్చిన మాట కోసం నేను ముందుకెళ్తున్నాను, నువ్వు నాతో రావొద్దు' అని జగన్ ఎమ్మెల్యే అయిన శ్రీకాంత్‌కు చెప్పారు. అది జగన్ తనను అభిమానించే వారిని, తనపై నమ్మకం పెట్టిన వారి గురించి ఆలోచించే పద్ధతి.
మరి తెలంగాణలో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పి ఇక్కడికి వచ్చారు? ఆస్తులు తగలేసుకున్న, కొంపలు కూల్చుకున్న కుటుంబాలను సమాధానపరిచరా? మిమ్మల్ని వదిలేసి వెళుతున్నాను, తప్పని చెప్పారా వాళ్లకు? ఆ బాధ్యత మీకు లేదా?
తెలంగాణ రాజకీయాల్లోకి మీరే వెళ్లారు, వాళ్లకు మీ ఇంటి కోడలిని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య సమస్యలు వస్తే తెలంగాణ వైపే నిలబడతానని చెప్పారు. మరి ఆ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత లేదా మీకు?
ఏపీలో 2024 ఎన్నికల్లో మీ డిపాజిట్లు గల్లంతయ్యాక ఇక్కడ ఏం చెబుతారు, ఆ తర్వాత ఎక్కడికి పోతారు?
వైఎస్సార్ కుటుంబ అంతరంగికుడు, స్వార్థమెరుగని రాజభక్తుడు, మిమ్మల్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన నిష్కలంకుడు కొండా రాఘవరెడ్డి వేస్తున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పరా?
జగన్ దంపతులను నిశ్చితార్థానికి పిలిచి వారిని అవమానించిన మీరు బంధువులకు, సమాజానికి ఏమి సమాధానం చెబుతారు?
బంధాలు నిలుపుకోవాలని మనసారా కోరుకుని నిశ్చితార్థానికి హాజరైన జగన్ దంపతులకు ఇక పెళ్లికి పోవద్దు అనిపించేంతగా అవమానం చేసిన మీరు వేలాది మంది వైఎస్సార్ బంధుజనానికి ఏమని చెబుతారు?
మీరు రాజకీయాల్లో ఉన్నారు. అన్నీ బహిరంగంగానే మాట్లాడుతున్నారు, కాబట్టి ఈ అంశాలపై సంబంధించిన వారినో, ప్రజలనో కన్విన్స్ చేయాలి. లేకపోతే మీరు చేసే ఏ విమర్శకూ, ఏ తిట్టుకూ, ఏ శాపనార్థానికి విలువలేదు.
మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వైఎస్ జగన్ దంపతులకు, వారి కుటుంబానికి ఆశీర్వచనమే అవుతుందని గుర్తుపెట్టుకోండి !
One thing is clear, Madam.
We have many indidividuals toxic to the core. They are operating from Telangana and Delhi and they want to see the political end of Jagan. You are just an insignificant & irrelevant addition to them !
Please note, Madam !
We, the people of Andhra, were deprived of a United State ! They did it managing the politicians !
But we will never lose YS Jagan. Because, we are the people and we are final !
Jagan is not just our leader, he is our extended family and our future ! He is the only hope for the future generations here.
Bye bye Akka !
కడప వాసి