ఈగల్ కూడా హను-మాన్ లాంటిదే.. రవితేజ

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయింది హను-మాన్ సినిమా. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ, ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇక అదే సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా పోటీ నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9వ…

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్టయింది హను-మాన్ సినిమా. సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ, ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇక అదే సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా పోటీ నుంచి తప్పుకుంది. ఫిబ్రవరి 9వ తేదీకి వస్తుంది.

తను నటించిన ఈగల్ సినిమాను, తాజా బ్లాక్ బస్టర్ హను-మాన్ తో పోలుస్తున్నాడు హీరో రవితేజ. ఈగల్ సినిమా కూడా హను-మాన్ లానే రూపాంతరం చెందిందని అంటున్నాడు.

“యాక్షన్ సినిమా ఉందన్నాడు దర్శకుడు. తక్కువ రోజుల్లోనే పూర్తయిపోతుందన్నాడు, సాంగ్స్ కూడా ఉండవన్నాడు. అలా చిన్నగా మొదలైంది ఈగల్. ఆ తర్వాత అది పెరుగుతూ వచ్చింది. స్క్రిప్ట్, స్ట్రక్చర్, సినిమా స్పాన్ రోజురోజుకు పెరిగింది. ఇంకా చెప్పాలంటే హను-మాన్ సినిమాలా పెరిగింది. ప్రారంభంలో హనుమాన్ సినిమా కూడా చిన్నగానే మొదలైంది. ఆ తర్వాత పెద్దదైంది. మా ఈగల్ కూడా అలానే పెరిగింది.”

కంటెంట్ పై నమ్మకంతో సినిమాను పెంచుకుంటూ వెళ్లామన్నాడు రవితేజ. దర్శకుడు తీసిన ఔట్ పుట్ పై చాలా నమ్మకంగా ఉన్నానని, అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నా పెద్దగా బాధ అనిపించలేదన్నాడు. తమ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వచ్చిన ఆడుతుందనే అర్థం వచ్చేలా స్పందించాడు.

ఈ సినిమా ప్రచారం కోసం తేజ సజ్జ రంగంలోకి దిగాడు. రవితేజను ఇంటర్వ్యూ చేశాడు. ఆ సందర్భంగా రవితేజ ఈ వ్యాఖ్యలు చేశాడు.