శ్రీలీల అనగానే డాన్స్ గుర్తొస్తుంది. రీసెంట్ గా ఆమె 'కుర్చీ మడతపెట్టిన' తీరు చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తన డాన్స్ తో లెక్కలేనంత మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తన అసలైన డాన్స్ ఇది కాదంటోంది.
స్వతహాగా క్లాసికల్ డాన్సర్ శ్రీలీల. చిన్నప్పట్నుంచి శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుంది. ఎన్నో ఆలయాల్లో ప్రదర్శనలిచ్చింది. ఆ అనుభవంతో వెండితెరపై మాస్ డాన్స్ చించేస్తోంది.
మళ్లీ ఇన్నాళ్లకూ తను నేర్చుకున్న శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం శ్రీలీలకు వచ్చింది. అవును.. శ్రీలీల నాట్యం చేసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమె స్టేజ్ ప్రదర్శన ఇచ్చింది. గోదాదేవి పాత్రలో ఆమె చేసిన నృత్యం అందర్నీ కట్టిపడేసింది.
“చాలామంది తెలుసోతెలియదో నాకు తెలియదు. శాస్త్రీయ నృత్యం నాలో భాగం. చాలా చిన్నప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఓ ట్రూప్ తో కలిసి ఆలయాల్లో ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. మా ట్రూప్ కు బాలెట్ అని పేరు. ఇది మీకు తెలియని నాలో మరో కోణం.”
సీనియర్ నటి మంజు భార్గవి ప్రోత్సాహంతో మళ్లీ ఇన్నాళ్లకు శాస్త్రీయ నృత్యాన్ని ప్రాక్టీస్ చేసి, స్టేజ్ షో ఇచ్చింది శ్రీలీల. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇలా ప్రాక్టీస్ చేసి మరీ నృత్య ప్రదర్శన ఇవ్వడం చాలా కొత్తగా ఉందని, తనకు ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చింది.