సుకుమార్ కుమార్తె-మ్యూజిక్ కోర్స్

టాలీవుడ్ లో బహుముఖంగా ప్రజ్ఞ కలిగిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. పైగా ఆయనకు వున్న అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే ఇండస్ట్రీలోనే వుంటారు. అందరితో వుంటారు. కొందరిలా.. నన్ను ముట్టుకోకు అన్నట్లు ముడుచుకుపోయి ఇంట్లో కూర్చోరు.…

టాలీవుడ్ లో బహుముఖంగా ప్రజ్ఞ కలిగిన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. పైగా ఆయనకు వున్న అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే ఇండస్ట్రీలోనే వుంటారు. అందరితో వుంటారు. కొందరిలా.. నన్ను ముట్టుకోకు అన్నట్లు ముడుచుకుపోయి ఇంట్లో కూర్చోరు. ఇగో తో రగిలిపోరు. ఆ విషయం పక్కన పెడితే పుష్ప 2 మేకింగ్ హడావుడిలో వున్న సుకుమార్ ఇప్పుడు అమెరికా వెళ్లారు. ఏదో షికారుకో, సరదాకో కాదు. తన కుమార్తె కోసం.

సుకుమార్ కుమార్తెకు సంగీతం ఇష్టం. అది ఎలాగూ నేర్చుకుంటున్నారు. అందులో భాగంగా, అమెరికాలోని ఓ ప్రతిష్టాత్మక సంగీత సంస్థలో కొద్ది రోజుల క్రాష్ కోర్స్ చేయడానికి అని అమెరికా వెళ్లారు. ఆమెతో కలిసి సుకుమార్ కూడా వెళ్లారు. సంగీతానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మక సంస్థ అది. కేవలం ఓ చిన్న క్రాష్ కోర్స్ కే అయిదారు కోట్లు ఖర్చు అవుతాయని తెలుస్తోంది. 

సుకుమార్ అయినా మరే తండ్రి అయినా సంపాదించేది ఎవరి కోసం పిల్లల కోసం, వారి అభిరుచుల కోసమే కదా. అందుకే సుకుమార్ ఇప్పుడు ఈ భారీ ఖర్చుకు వెనుకాడకుండా అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ కారణంగా పుష్ప 2 సినిమాకు ఓ వారం.. పది రోజులు బ్రేక్ వచ్చింది.