తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ ల్లో ఒకరు అనిత. పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే అయిన అనిత నోరు విప్పారంటే ఇక మామూలుగా వుండదు. గత నాలుగు రోజులుగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తెలుగుదేశం అధిపతి చంద్రబాబు వరకు వాలంటీర్ల మీద విమర్శలు కురిపిస్తున్నారు. అవి కూడా సరైన విమర్శలు కాదు. అడ్డగోలు విమర్శలు. అధినేతలే ఇలా రెచ్చిపోతే ఇక చోటా నాయకులు ఎందుకు ఊరుకుంటారు. వారికి తోచినట్లు వారు కూడా మాట్లాడేస్తున్నారు.
అనిత కూడా తన వంతు గొంతు కలిపారు. కానీ అక్కడే దారణమైన ఓ మాట అన్నారు. ఫించన్ మంజూరు చేయాలంటే వాలంటీర్ల కోర్కెలు తీర్చాల్సి వస్తోందనే దారుణమైన ఆరోపణ చేసారు. ఇళ్ల స్థలం కావాలన్నా ఇదే పరిస్థి అన్నారు.
ఇక్కడ అనిత మరిచిపోయిన లాజిక్ ఏమిటంటే పింఛను అనేది వృద్ధులకు, వికలాంగులకు ఇస్తారు కానీ పాతికేళ్ల వాళ్లు, నలభై ఏళ్ల వాళ్లకు కాదు. 60 పైబడిన వారికే ఎక్కువగా ఫింఛన్లు ఇచ్చేది. వాలంటీర్లుగా పని చేసేవాళ్లు ఎక్కువగా పాతికేళ్ల యువత. వారిలోనూ ఎక్కువగా అమ్మాయిలు. ఈ పాతికేళ్ల కుర్రాళ్లు ఆ అరవై ఏళ్ల అవ్వలను తమ కోర్కెలు తీర్చాలని కోరడం ఏమిటో.. దారుణమైన సంగతి.. విడ్డూరం కాకపోతే.
ఆరొపణలు చేసేటపుడు కాస్త లాజిక్ లకు నిలిచేవి, సరైనవి చేస్తే బెటరేమో? లేదంటే జనం నవ్వుతారు.