టీడీపీ వారికీ వైసీపీ జాబ్స్…?

అదేంటి టీడీపీ అంటే వైసీపీకి పడదు కదా. ఇద్దరి మధ్యన రాజకీయం వైరం ఉంటుంది కదా అని డౌట్లు రావచ్చు. కానీ ఏమో పెద్ద మనసు చేసుకున్నారు పెద్దల సభలో సభ్యుడైన విజయసాయిరెడ్డి. వైసీపీ…

అదేంటి టీడీపీ అంటే వైసీపీకి పడదు కదా. ఇద్దరి మధ్యన రాజకీయం వైరం ఉంటుంది కదా అని డౌట్లు రావచ్చు. కానీ ఏమో పెద్ద మనసు చేసుకున్నారు పెద్దల సభలో సభ్యుడైన విజయసాయిరెడ్డి. వైసీపీ వరసబెట్టి నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా సూపర్ హిట్ కావడంతో ఆ ఆనందంలో విజయసాయిరెడ్డి కొన్ని తమాషా కామెంట్స్ చేశారు.

ఏపీలో టీడీపీ నేతలు కొందరు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి కూడా అవసరం అయితే జాబ్ మేళాలో జాబ్స్ ఇప్పిస్తామని సెటైర్లు వేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన ఇద్దరు కొడుకులకు కూడా జాబ్స్ ఉన్నాయని వారు కోరుకుంటే ఇప్పిస్తామని హాట్ కామెంట్స్ చేశారు.

చీటికీ మాటికీ వైసీపీ సర్కార్ మీద తన మీద రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్న అయ్యన్నపాత్రుడుకి పనీ పాటా ఏదీ లేదని కూడా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయన తెల్లారి లేస్తే ఏదో కామెంట్స్ చేస్తూ వైసీపీ మీద బురద జల్లాలని చూస్తారని మండిపడ్డారు. అలాంటి వారుకి పనీ పాటా ఇప్పిస్తామని, తమ జాబ్ మేళాలో ఆ అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అంటున్నారు.

ఇక విశాఖలో నిర్వహించిన రెండు రోజుల జాబ్ మేళా సూపర్ హిట్ అయిందని, అత్యధికంగా 12.50 లక్షల రూపాయల‌ నెల జీతంతో చాలా మంది యువత ఉద్యోగాలు తెచ్చుకోవడం ఆనందం కలిగించిందని ఆయన అన్నారు. వైసీపీ ఏం చేస్తోంది అని ప్రశ్నించేవారికి ఇది సరైన జవాబు అని ఆయన అన్నారు. 

అదే విధంగా వైసీపీ మెగా జాబ్ మేళాను నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తామని, ఏపీలోని యువతకు ఉపాధి కల్పించడమే తమ ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.