ఇంద్రగంటి ‘వైకుంఠపాళి’

ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి దర్శకుడు. అందులో సందేహం లేదు. కానీ వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కి దిగుతుంటారు. పాము నోట్లో పడుతుంటారు. మళ్లీ మొదటి నుంచీ ఆడుతుంటారు. అలా నిచ్చెన కావాల్సినపుడల్లా నిర్మాత శివలెంక కృష్ణ…

ఇంద్రగంటి మోహనకృష్ణ మంచి దర్శకుడు. అందులో సందేహం లేదు. కానీ వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కి దిగుతుంటారు. పాము నోట్లో పడుతుంటారు. మళ్లీ మొదటి నుంచీ ఆడుతుంటారు. అలా నిచ్చెన కావాల్సినపుడల్లా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వుండనే వుంటారు.

సరైన హిట్ లేని టైమ్ లో రెండు సార్లు సినిమా చేసారు కృష్ణ ప్రసాద్. ఆ వెంటనే మోహన కృష్ణ ఎక్కడికో వెళ్లిపోతారు. అక్కడ దెబ్పతింటారు. బుద్దిగా దారితప్పి మళ్లీ ఇంటికి వచ్చిన స్కూలు పిల్లాడిలా శ్రీదేవి మూవీస్ కు వచ్చేస్తారు.

సమ్మోహనం సినిమా చేసారు. మంచి హిట్. ఆ వెంటనే వెళ్లి నాని తో వి సినిమా చేసారు. తనవి కాని జోళ్లు. ఆశ సహజం కదా. ట్రయ్ చేసారు. కానీ పరాజయం పలకరించింది. దాంతో మళ్లీ మరోసారి సుధీర్ బాబుతో ట్రయ్ చేసారు. వి సినిమా కిందకు దింపిన దాని కన్నా దింపింది ఈ సినిమా. అందుకే ఇప్పుడు మళ్లీ శ్రీదేవీ మూవీస్ తో సినిమా ప్రకటించారు.

ప్రియదర్శి హీరో. అంటే కచ్చితంగా ఈసారి ఇంద్రగంటి తనదైన హ్యూమర్ ప్లస్ ఎమోషన్ నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారనుకోవాలి. అందువల్ల మళ్లీ మరోసారి నిచ్చెన ఎక్కే అవకాశం వుంది. ఆ తరువాత అయినా తన నుంచి జనం ఏం కోరుకుంటున్నారో, ఆ దిశగానే వెళ్తే బాగుంటుందేమో?