డజను మందిపైగా ఉన్న మెగా హీరోల్లో ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు నాగబాబు. నోటికి ఏది పడితే.. ఎవరిపై పడితే వారిపై మాట్లాడడం తీరా అది వైరల్ అయిపోవడంతో క్షమాపణలు చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. ఇటీవల 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోలీస్ క్యారెక్టర్ తన కొడుకు లాంటి వారు మాత్రమే చేయాలి తప్పా మిగత వారు అందుకు పనికి రారు అన్నట్లుగా మాట్లాడారు. అది కాస్తా మిగత హీరోల అభిమానుల మనోభావాలు దెబ్బతిని సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విమర్శలు చేయడంతో ఇవాళ క్షమపణ చెప్పారు.
తన కొడుకు నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ క్యారెక్టర్ చేసే వ్యక్తులు 6 అడుగుల 3 అంగుళాలు ఉంటే బాగుంటుందని, 5 అడుగుల 3 అంగుళాల వ్యక్తులు అలాంటి క్యారెక్టర్ చేస్తే బాగోదని ఇన్ డైరెక్ట్‌గా జూ. ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీంతో జూనియర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై విమర్శలు కురిపించడంతో ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్ననని.. ఎవరైనా ఆ మాటలకి నొచ్చుకుంటే క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.
సినిమాలు, కామోడీ షోలతో పాటు ఎన్నికల టైంలో రాజకీయాలు చేసే నాగబాబుకు ఇలా మాట్లాడటం కొత్తేమి కాదు. ఎప్పటికప్పుడు పక్కవారిని గిల్లడం తర్వాత క్షమపణలు చెప్పడం ఆయనకు మాములే అయినా.. ఇటీవల పవన్ ఏ మీటింగ్‌లో అయిన ఇతర హీరోలను పొగుడుతూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తుంటే నాగబాబు కొత్త వివాదాన్ని సృష్టించడంతో తన తమ్ముడు పవన్ అదేశాలు లేక చంద్రబాబు అదేశాలతో ఆయన క్షమపణలు చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పి తర్వాత ఏదో ఫోటో పట్టుకొని.. బాలకృష్ణ తెలియదు అని చెప్పడం తప్పే. ఆయన గొప్ప హాస్య నటుడు. ఆయన నాకు తెలియదనడం తప్పే అంటూ వెటకారంతో మాట్లాడిన విషయం తెలిసిందే. కాగా టీడీపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేయనున్నారు.