ఆ హీరో రెండో సినిమా అది కాదంట!

హీరోల సినిమాల ఆర్డర్ మారడం కొత్తేంకాదు. కాకపోతే దాదాపు రెడీ అయిన సినిమా వెనక్కు వెళ్లిపోయి, మరో సినిమా ముందుకురావడం మాత్రం కొంచెం కొత్తే. హీరో ఆశిష్ విషయంలో ఇది జరుగుతోంది. Advertisement తన…

హీరోల సినిమాల ఆర్డర్ మారడం కొత్తేంకాదు. కాకపోతే దాదాపు రెడీ అయిన సినిమా వెనక్కు వెళ్లిపోయి, మరో సినిమా ముందుకురావడం మాత్రం కొంచెం కొత్తే. హీరో ఆశిష్ విషయంలో ఇది జరుగుతోంది.

తన రెండో ప్రయత్నంగా సెల్ఫిష్ అనే సినిమా చేశాడు ఆశిష్. ఇదిగో అదిగో వస్తుందన్నారు. ఒకట్రెండు రిలీజ్ డేట్స్ కూడా చెప్పినట్టున్నారు. అంతలోనే మరో సినిమా ప్రకటించారు.

అవును.. ఆశిష్ నుంచి వచ్చే రెండో సినిమా సెల్ఫిష్ కాదు. అతడి తాజా చిత్రం 'లవ్ మీ'. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకుడు. ఈ సినిమానే ఆశిష్ రెండో చిత్రం. ఏప్రిల్ 27న సినిమా రాబోతున్నట్టు స్వయంగా దిల్ రాజు ప్రకటించారు.

సెల్ఫిష్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది దిల్ రాజు టీమ్. కానీ ఆ ప్రాజెక్టు అనుకున్న విధంగా రాలేదు. దీంతో మళ్లీ రీషూట్స్ కు వెళ్లారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదేమో.. ఉన్నఫలంగా 'లవ్ మీ' అనే ప్రాజెక్టును ప్రకటించడం, విడుదల తేదీ కూడా చెప్పడం చకచకా జరిగిపోయాయి. అలా ఆశిష్ సినిమాల ఆర్డర్ మారింది.

ఈ సంగతి పక్కనపెడితే.. ఒక్క విషయంలో మాత్రం 'లవ్ మీ' సినిమా ఆకర్షిస్తోంది. ఈ ఘోస్ట్ మూవీని సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ లెన్స్ లో చూడాల్సిందే.