నారాయణ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడిగా మారాడు. అభంశుభం అమ్మాయిని లైంగికంగా వేధించాడు. ఆమెను గర్భవతిని చేశాడు. విశాఖపట్నంలో జరిగింది ఈ ఘటన.
పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలో ఉన్న నారాయణ స్కూల్ లో పీఈటీగా పనిచేస్తున్నాడు దుర్గాప్రసాద్. అదే స్కూల్ లో 9వ తరగతి చుదువుతున్న బాలికపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి మెల్లగా ఆమెను వశపరుచుకున్నాడు.
ఓ రోజు త్రో-బాల్ ప్రాక్టీస్ ఉందంటూ పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పలుమార్లు అదే తరహాలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజులకు బాలిక గర్భవతి అయింది.
అనారోగ్యంగా కనిపిస్తున్న బాలికను హాస్పిటల్ కు తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, పోక్సో చట్టం కింద దుర్గాప్రసాద్ ను అరెస్ట్ చేశారు.
జరిగిన ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వేగంగా విచారణ పూర్తిచేసి, దుర్గాప్రసాద్ కు కఠినశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఘటనకు స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని, లక్షల రూపాయల ఫీజులు తీసుకొని, కనీసం ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నారాయణ యాజమాన్యం వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.