శ్రీలీలకు కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

“నేను లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను. ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే, అది నా భర్తతోనే.” రీసెంట్ గా ఓ ప్రశ్నకు శ్రీలీల ఇచ్చిన సమాధానం ఇది. సినిమాల్లో లిప్ కిస్సులకు మీరు…

“నేను లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను. ఒకవేళ లిప్ లాక్ చేయాల్సి వస్తే, అది నా భర్తతోనే.” రీసెంట్ గా ఓ ప్రశ్నకు శ్రీలీల ఇచ్చిన సమాధానం ఇది. సినిమాల్లో లిప్ కిస్సులకు మీరు ఓకేనా అనే కామన్ ప్రశ్న, ఈ హీరోయిన్ కు ఎదురవ్వగా.. ఆ ప్రశ్నకు ఇలా ప్రశ్నించింది.

ఇంతవరకు బాగానే ఉంది కానీ, అసలు మేటర్ ఆ తర్వాతే మొదలైంది. శ్రీలీల స్టేట్ మెంట్ కు నెటిజన్లు కౌంటర్లు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఆమె ఓ లిప్ కిస్ సన్నివేశంలో నటించింది. ఆ సీన్ ను వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ కన్నడ సినిమాలో హీరో పెదాలను శ్రీలీల ముద్దు పెట్టింది.

ఈ సన్నివేశానికి శ్రీలీలను ట్యాగ్ చేస్తూ ఓ రేంజ్ లో ఏడిపిస్తున్నారు నెటిజన్లు. ఆల్రెడీ లిప్ కిస్ సీన్ చేసి, ఇప్పుడు చేయనంటే ఎలా అని కొందరు ప్రశ్నిస్తుంటే.. ఈ సన్నివేశంలో ఉన్నది నీ భర్తనా అంటూ మరికొందరు సెటైర్లు అందుకున్నారు.

ఈ విషయంలో శ్రీలీలకు మద్దతిచ్చే వాళ్లు కూడా తయారయ్యారు. అది గ్రాఫిక్స్ అని కొందరంటే, శ్రీలీల పెట్టిన ముద్దు, లిప్-లాక్ కేటగిరీలోకి రాదని మరికొందరు అంటున్నారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని మరో టర్న్ తిప్పారు ఇంకొంతమంది. ఈ స్టేట్ మెంట్ నిజం కాదని రుజువు చేసేందుకైనా, భవిష్యత్తులో ఏదో ఒక హీరో, శ్రీలీలను ముద్దుపెడతాడంటూ.. కొంతమంది హీరోల పేర్లు కూడా ప్రస్తావిస్తున్నారు. వీళ్లు అడిగితే శ్రీలీల మూతి ముద్దుకు నో చెప్పదని అంటున్నారు.

భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పోషించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. త్వరలోనే ఆమె వైష్ణవ్ తేజ్ సరసన ఆదికేశవ సినిమాలో కనిపించనుంది.