అధినేత అన్నయ్య కదా.. అందువల్ల ఆ మాత్రం స్పెషల్ వుంటుంది మరి. జనసేన తరపున ఏ నిజయోకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ వుందా? పోనీ ఆ సంగతి అలా వుంచి అసలు ఏ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తుందో క్లారిటీ వుందా? రెండూ లేవు
అధినేత పవన్‌కు వుందేమో తప్ప అభ్యర్ధులకు లేదు. అంతా అయోమయం, అగమ్య గోచరం. వైకాపా తరపున పేర్లు ప్రకటించేసారు. అలకలు, ఆగ్రహాలు అయిపోయాయి. ప్రచారం సాగిపోతోంది.
కానీ జనసేనలో ఒక్కరికి మాత్రం ఈ సమస్య లేదు. ఆయనే నాగబాబు. ఆయనకు అనకాపల్లి ఎంపీ సీట్ అప్పగించేసారు. ఆయన నేరుగా అనకాపల్లిలో వాలిపోయారు. ప్రచారం చేసుకుంటున్నారు. లోకల్ లీడర్లను కలుస్తున్నారు. పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్తున్నారు. గుళ్లు గోపురాలు దర్శిస్తున్నారు. పనిలో పనిగా అలిగిన వారిని బుజ్జగించడానికి పవన్ కళ్యాణ్ నే నేరుగా దిగి వస్తున్నారు.
ఇలా ఒక్క సీట్ కోసం ఇంత జరుగుతోంది. మరి ఇలాంటి అభ్యర్ధులు కాదా మిగిలిన వారు. వాళ్లకు క్లారిటీ వద్దా? ప్రచారానికి టైమ్ వద్దా? కేవలం నాగబాబు గెలిచేసి ఎంపీ అయిపోతే చాలా? పవన్ తను కొత్త తరహా రాజకీయాలు చేస్తా అని చెప్పారు? అంటే ఇవేనా?