Advertisement

Advertisement


Home > Politics - National

అయోధ్య రామయ్య కోసం తిరుమల ప్లాన్

అయోధ్య రామయ్య కోసం తిరుమల ప్లాన్

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎన్నో రకాలున్నాయి. సర్వదర్శనం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం వరకు దాదాపు 12 రకాలుగా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తోంది టీటీడీ. ఇన్ని కాకపోయినా, అయోధ్యలో కూడా దర్శనాల్లో రకాలు చోటు చేసుకుంటున్నాయి.

అయోధ్య రామ మందిరంలో, ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రతి 2 గంటల స్లాట్‌లో భక్తులకు సులభ దర్శనం కోసం పాస్‌లు జారీ చేస్తున్నారు. ఇందుకోసం 300 మంది రామభక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలుంది.

ఇది కాకుండా, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుల సిఫార్సుపై సుమారు 150 మందికి ఆఫ్‌లైన్‌లో పాసులు జారీ చేస్తారు. సులభ దర్శనం కోసం ప్రత్యేక లైన్ ఉంటుంది, దీని ద్వారా భక్తులు తక్కువ సమయంలో సౌకర్యవంతంగా బాలరాముడ్ని దర్శించుకోవచ్చు. త్వరలోనే మరికొన్ని రకాల దర్శనాల్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారు.

అయోధ్యలో కొలువుదీరిన రాముడికి ప్రస్తుతానికి హారతి కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆ హారతి కోసం ప్రత్యేకంగా కొంతమంది భక్తుల్ని అనుమతిస్తారు. మధ్యాహ్నం ఒక గంట పాటు గుడి తలుపులు మూసేస్తారు.

ప్రారంభోత్సవం నాటి రోజులతో పోల్చి చూసుకుంటే, ప్రస్తుతం రామాలయాన్ని దర్శిస్తున్న భక్తుల సంఖ్య కొంత తగ్గింది. అయినప్పటికీ ట్రస్టు చెప్పినట్టుగా సాయంత్రం 7 గంటల్లోపు దర్శనాలు పూర్తవ్వడం లేదు. దీంతో దర్శనవేళల్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. త్వరలోనే తిరుమల తరహాలో బ్రేక్ దర్శనాలను కూడా ప్రారంభించబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?