అనంతపురం జిల్లా రాప్తాడులో ఇవాళ వైసీపీ 'సిద్ధం' సభకు జన సముద్రంల జనాలు తరలి వచ్చారు. సభ వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షలపై విరుచుకుపడుతూ.. వైసీపీ కార్యకర్తలను, అభిమానులను దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ స్థానాలు గెలవాలని టార్గెట్ అని ప్రకటించారు.
పేదలకు- పెత్తందారులకు.. విశ్వసనీయతకు- వంచనకు యుద్ధం పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం.. మంచిపని ఒక్కటైనా ఉందా?. పక్కరాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? అంటూ పెత్తందార్లతో యుద్దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 'ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్‌లోనే ఉండాలి అంటూ తనదైన శైలీలో టీడీపీ, జనసేనపై సెటైర్లు పేల్చారు.
చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదని.. మానిఫెస్టో మాయం చేసి.. హామీలు ఎగ్గొట్టే బాబు ఇప్పడు ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. చుక్కల్ని దింపుతా అంటాడు అంటూ బాబుకు సీఎం వైయస్ జగన్ చురకలు అంటించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని.. ఈ విషయాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా కార్యకర్తలు వివరించాలని.. చేసిన.. చేస్తున్న అభివృద్ధిని అందరికి గుర్తుచేయాలి' అని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా ఉంటే పొత్తులు ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకు? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలు జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారని బాబుకి తెలుసని. అందుకే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని.. ఈసారి వైసీపీ గెలిస్తే చంద్రముఖి బెడద ఇక ఉండదు. తప్పు చేస్తే చంద్రముఖి గ్లాస్ పట్టుకుని సైకిల్ ఎక్కి ప్రజల రక్తం తాగడానికి వస్తుంది అంటూ హెచ్చారించారు. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు అని సీఎం వైయస్ జగన్ అన్నారు.