అందాల తారగా ఓ వెలుగు వెలుగుతోంది. కోట్లలో డబ్బు ఉంది. లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి హీరోయిన్ కానిస్టేబుల్ జాబ్ కు అప్లయ్ చేస్తుందా..? సన్నీ లియోన్ మాత్రం అప్లయ్ చేసింది.
ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో సన్నీ లియోన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ పై సన్నీ లియోన్ పేరు మాత్రమే కాదు, ఆమె హాట్ ఫొటో కూడా దర్శనమిచ్చింది.
నిజానికి ఇది సన్నీలియోన్ చేసిన పని కాదు, ఎవరో ఆకతాయి చేసిన పని. యూపీలో ఇలాంటి చోద్యాలకు కొదవ లేదు. ఆమెకు హాల్ టికెట్ నంబర్ కేటాయించడంతో పాటు, ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇచ్చారు.
జరిగిన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేపట్టారు. మహోబా ప్రాంతానికి చెందిన ఓ సెల్ నంబర్ ఆధారంగా ఆ హాల్ టికెట్ జనరేట్ అయింది. అడ్రస్ మాత్రం ముంబయిది ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా హాల్ టికెట్ అప్ లోడ్ చేసే సమయంలో ఈ పని జరిగినట్టు గుర్తించారు.
జరిగిన ఘటనపై ఉత్తరప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఆకతాయి చర్యలకు పాల్పడే వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎగ్జామ్ సెంటర్ సిబ్బంది, తమ సెంటర్ కు పరీక్ష రాయడానికి సన్నీ లియోన్ రాలేదని స్పష్టం చేయడం కొసమెరుపు.