ఎంతైనా ఆమెది ఎల్లో కులం. దీంతో రాత్రికి రాత్రే ఆమెకు ఎల్లో మీడియాలో విపరీతమైన ప్రాధాన్యం. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇదే బీజేపీకి రెండు రోజుల క్రితం వరకూ సోము వీర్రాజు నాయకత్వం వహించారు. వీర్రాజుపై ఎల్లో మీడియా ఎంత వివక్ష చూపిందంటే… నడ్డా, అమిత్‌షాలతో పాటు భారీ బహిరంగ సభల్లో పాల్గొంటే కనీసం ఆయన ఫొటో , పేరు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి.
ఈ రోజు పురందేశ్వరి విషయానికి వస్తే… సోము వీర్రాజుపై నిషేధం విధించిన పత్రిక ఏకంగా ఆమె నిలువెత్తు ఫొటోను ప్రచురించి తన కుల స్వభావాన్ని చాటుకుంది. పురందేశ్వరి, వీర్రాజు ఒకే పార్టీకి చెందిన నాయకులు. కానీ తేడా ఒక్కటే. వీర్రాజు కాపు, పురందేశ్వరి కమ్మ. ఇంతకంటే పురందేశ్వరికి ప్రాధాన్యం ఇవ్వడానికి అర్హత ఏం కావాలి? అందుకే ఆమె ఏపీ బీజేపీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంతో ఎల్లో మీడియా సంబరపడుతోంది.
ఇంతకాలం సోము వీర్రాజు టీడీపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. బీజేపీలోని టీడీపీ అనుకూల నాయకులు తమ ఇష్టానుసారం చంద్రబాబు కోసం పార్టీని బలపెట్టే చర్యలకు వీర్రాజు అడ్డుగా నిలిచారు. వీర్రాజు పదవీ కాలం ముగియడంతో నాయకత్వ మార్పు జరిగింది. ఎల్లో మీడియా అధినేతల సామాజిక వర్గానికి చెందిన ఎన్టీఆర్ తనయ పురందేశ్వరి చేతికి ఏపీ బాధ్యతలు వచ్చాయి.
దీంతో తమ సామాజిక వర్గానికి ప్రయోజనం కలిగించేలా పురందేశ్వరి నడుచుకుంటారని ఎల్లో మీడియా అధినేతలు, టీడీపీ నాయకులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ను కట్టడి చేయడానికి పురందేశ్వరి నాయకత్వం దోహదపడుతుందని వారంతా నమ్ముతున్నారు. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. పార్టీ కంటే కులమే మిన్న నినాదం వారిని నడిపిస్తోంది. మరి పురందేశ్వరి బీజేపీ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తారా? తన కులం ఆకాంక్షలకు తగ్గట్టు నడుచుకుంటారా? అనేది కాలం తేల్చాల్సిన అంశం.